Home తాజా వార్తలు రూ. 21,235 కోట్లు వచ్చాయ్

రూ. 21,235 కోట్లు వచ్చాయ్

FPIs turn net buyers in June, invest Rs 21,235 crore

 

జూన్‌లో విదేశీ పెట్టుబడుల వెల్లువ
మూడు నెలలు ఉపసంహరణ తర్వాత జోరు

న్యూఢిల్లీ: వరుసగా మూడు నెలలు మూలధనాన్ని ఉపసంహరించుకున్న తర్వాత విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐ) మళ్లీ భారత్‌లో పెట్టుబడులతో తిరిగివచ్చారు. జూన్‌లో ఇప్పటివరకు వారు దేశీయ మూలధన మార్కెట్లలో (స్టాక్, డెట్ మార్కెట్లు) రూ. 21,235 కోట్ల నికర పెట్టుబడి పెట్టారు. డిపాజిటరీ డేటా ప్రకారం, ఎఫ్‌పిఐలు స్టాక్ మార్కెట్లో రూ.22,893 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. డెట్ మార్కెట్ నుండి 1,658 కోట్ల రూపాయలను ఉపసంహరించుకున్నాడు. ఈ విధంగా జూన్ 1- నుంచి 26 మధ్య కాలంలో మూలధన మార్కెట్లో రూ. 21,235 కోట్ల నికర పెట్టుబడి వచ్చింది.

అయితే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో విదేశీ పెట్టుబడిదారులు భారతదేశం నుంచి మొత్తం రూ.1.3 లక్షల కోట్లు ఉపసంహరించుకున్నారు. జూన్ ముందు విదేశీ పెట్టుబడిదారులు వరుసగా మూడు నెలలు భారత మార్కెట్ నుండి మూలధనాన్ని ఉపసంహరించుకున్నారు. మేలో వారు రూ .7,366 కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఏప్రిల్‌లో రూ .15,403 కోట్లు ఉపసంహరించుకున్నారు. మార్చిలో రికార్డు స్థాయిలో రూ.1.1 లక్షల కోట్లను భారత్ నుంచి వెనక్కి తీసుకున్నారు. ఈ విధంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎఫ్‌పిఐలు భారత మూలధన మార్కెట్లో రూ.1.32769 లక్షల కోట్ల నికర అమ్మకాలు చేపట్టారు.

చిన్న, మిడ్ స్టాక్స్‌లోనే పెట్టుబడులు
స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్‌లలో ఎఫ్‌పిఐలు పెట్టుబడులు పెంచుతున్నాయని మార్కెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. వారు ఏడాది కాలంగా ఈ స్టాక్‌లలో పెట్టుబడులు పెడుతున్నారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ ఉత్తమైందిగా భావిస్తున్నా వారు, మరిన్ని పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. షేర్ల విలువ ఇంకా తక్కువగా ఉందని మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ మేనేజర్ శ్రీవాస్తవ అన్నారు.

అందుకే కొనుగోలు చేయడానికి ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారని తెలిపారు. భారతీయ కంపెనీల షేర్లు దీర్ఘకాలంలో ఎఫ్‌పిఐలకు మంచి పెట్టుబడి ఎంపికలుగా ఉన్నాయి. అదే సమయంలో ప్రపంచ మార్కెట్లో నగదు పెరిగింది. ఇది అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు చేరుతోంది. భారతదేశం కూడా దీని నుండి ప్రయోజనం పొందే అవకాశముందని నిపుణులు అంటున్నారు.