Home అంతర్జాతీయ వార్తలు ఐసిస్ నరమేధంపై ఫ్రాన్స్ యుద్ధ భేరి

ఐసిస్ నరమేధంపై ఫ్రాన్స్ యుద్ధ భేరి

paris-attacksపారిస్: ఐసిస్ నరమేధంపై ఫ్రాన్స్ యుద్ధ భేరి పూరించింది. అగ్రరాజ్యం అమెరికాతో కలిసి ఐసిస్ స్థావరాలపై బాంబుల వర్షం కురుపిస్తుంది. పారిస్‌పై ఉగ్రదాడికి ప్రతీకారంగా వైమానిక దాడులు చేస్తుంది. సిరియాలోని ఐసిస్ అధీనంలో ఉన్న రక్కా నగరంపై ఫ్రాన్స్ దాడులు నిర్వహిస్తుంది. 10 యుద్ధ విమానాలు, బాంబులతో ఫ్రాన్స్ సైన్యం దాడులు చేపట్టింది. ఇప్పటి వరకు ఈ దాడుల్లో ఐసిస్ కమాండ్ కేంద్రం, జిహాదీ శిక్షణాశిబరం ధ్వంసమయినట్లు సమాచారం.