Thursday, April 25, 2024

పెట్టుబడి పేరుతో మోసం

- Advertisement -
- Advertisement -

Fraud in the name of investment:2 arrested

 

హైదరాబాద్ : ట్రేడింగ్‌లో పెట్టుబడిపెడితే భారీగా లాభాలు వస్తాయని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన ఇద్దరు నిందితులను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ల్యాప్‌టాప్, మూడు మొబైల్ ఫోన్లు, పాస్‌బుక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….ఎపిలోని నెల్లూరు జిల్లా, కలిగిరి మండలం, అయ్యప్పరెడ్డి పాలెంకు చెందిన బండ్లమూడి రవి నగరంలోని అత్తాపూర్‌లో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ములుగు జిల్లా, మంగపేట, రామచంద్రునిపేటకు చెందిన వేములవాడ రఘ వ్యవసాయం చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్, లక్నోకు చెందిన సోదరులు వీర్ సింగ్, సందీప్ సింగ్ మాస్టర్ ట్రేడర్స్, సూపర్ ఆన్‌లైన్ సర్వీసెస్, ట్రేడ్ క్లిఫ్, వజిరాక్స్ పేరుతో కార్యాలయాలు హైదరాబాద్, బెంగళూరు, గోవా తదితర ప్రాంతాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసి ట్రేడింగ్ పేరుతో ప్రకటనలు విడుదల చేస్తున్నారు. వీరు ఎంఎల్‌ఎంలో పనిచేసి చాలామందిని మోసం చేసిన రవి వీరితో చేతులు కలిపాడు.

హైదరాబాద్‌లో వారి తరఫున సోషల్ మీడియాలో మార్కెటింగ్ నిర్వహిస్తున్నాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి ప్రకటనలు ఇస్తున్నాడు. వీరికి బ్యాంక్ ఖాతాలను వేములవాడ రఘు ఇస్తున్నాడు. ఇద్దరికి లక్నోలోని నిందితులు కమీషన్ ఇస్తున్నారు. మల్కాజ్‌గిరికి చెందిన నోరి సుబ్రహ్మణ్యం ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. తన స్నేహితుల ద్వారా ట్రేడ్ క్లిఫ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ గురించి తెలుసుకున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చెప్పడంతో ఏప్రిల్ 02, 2021న వెబసైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. బాధితుడికి యూజర్ ఐడి, పాస్‌వర్డ్ ఇచ్చారు. వెంటనే నిందితులు ఇచ్చి బ్యాంక్ ఖాతాకు రూ.3,07,800 ట్రాన్స్‌ఫర్ చేశాడు. తర్వాత ఆరు ట్రాన్‌జాక్షన్ల ద్వారా రూ.8,20,800 పంపించాడు.

ఈ క్రమంలోనే గతంలో తాను డబ్బులు పంపించిన వారే క్రిప్టోకరెన్సీ పేరుతో మరో వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు తెలుసుకున్నారు. దానిలో పెట్టుబడి పెట్టాల్సిందిగా సరూర్‌నగర్‌కు చెందిన తన స్నేహితులు ముక్తా నగేష్‌ను కోరాడు. అతడి ద్వారా రూ.3,06,180 డబ్బులు పంపించాడు. ఇద్దరి నుంచి డబ్బులు పంపించినత తర్వాత నిందితులు స్పందించడం మానివేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించాడు. వెంటనే రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఇన్స్‌స్పెక్టర్లు నరేందర్ గౌడ్, ప్రకాష్ దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News