Thursday, April 25, 2024

సిసిఎంబిలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం

- Advertisement -
- Advertisement -

సిసిఎంబిలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన నిందితుడు
అరెస్టు చేసిన రాచకొండ సైబర్ క్రైం పోలీసులు

హైదరాబాద్: సిసిఎంబిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎపిలోని కర్నూలు జిల్లా, బేతంచర్ల మండలానికి చెందిన ఆదూరి ప్రవీణ్‌కుమార్ నిరుద్యోగి. బిఎస్సి బయోటెక్నాలజీ చదివిన ప్రవీణ్ కొద్ది రోజులు విజయవాడలో కెమిస్ట్‌గా పనిచేశాడు. తర్వాత హైదరాబాద్‌లో ఓ కంపెనీలో రేడియోగ్రాఫర్‌గా పనిచేశాడు. కోవిడ్ సమయంలో 2021లో ఉద్యోగం పోవడంతో ఖాళీగా ఉంటున్నాడు.

ఈ క్రమంలోనే ఉద్యోగాల పేరుతో మోసం చేయాలని ప్లాన్ వేశాడు.దానికి సిసిఎంబిని వాడుకోవాలని లింక్డ్‌ఇన్‌లో ఖాతా ఓపెన్ చేశాడు. అందులోని తన పేరు ప్రణయ్ చౌదరిగా సీనియర్ రిసెర్చ్ ప్రాజెక్ట్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నట్లు పెట్టుకున్నాడు. తన వద్ద ప్రాజెక్ట్ అసోసియేట్‌గా పనిచేసేందుకు కాంట్రాక్ట్ పద్దతిలో కావాలని పెట్టుకున్నాడు. దీనిని చూసిన పలువురు బాధితుల వద్ద డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నాడు. కర్నాటకకు చెందిన ఓ యువతి దీనిని చూసి నిందితుడిని సంప్రదించగా ఆమె ఉద్యోగం ఇప్పిస్తానని నెలకు రూ.33,000 జీతం ఇవ్వనున్నట్లు చెప్పాడు. తర్వాత ఐడి కార్డు తదితరాల పేరు చెప్పి డబ్బులు తీసుకున్నాడు.

ఇలా చాలామంది వద్ద తక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుని మోసం చేసిన వారు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఉద్యోగాల పేరుతో భారీ మొత్తం తీసుకోవాలని ప్రవీణ్ ప్లాన్ వేశాడు. తనను సంప్రదించిన రాచకొండ కమిషనరేట్‌కు చెందిన యువతికి సిసిఎంబిలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు, దానికి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడు. దీనిపై అనుమానం వచ్చిన యువతి వెంటనే సిసిఎంబి డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసిన ఇన్స్‌స్పెక్టర్ నరేందర్ గౌడ్ నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News