Thursday, March 28, 2024

కెసిఆర్ రూ.11 వేల కోట్లు ఇస్తే… మోడీ రూ.210 కోట్లు ఇచ్చారు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Free Current give by KCR Govt

సిద్దిపేట: రైతులకు ఉచిత కరెంట్, ఎరువులు, పంట పెట్టుబడి ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు.  కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ దుబ్బకా నియోజకవర్గంలోని రాయికల్ మండల కేంద్రంలో రైతులు భారీ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. జెండా ఊపి ర్యాలీని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాయికల్ లో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంత్రి హరీష్ పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా హరీష్ మీడియాతో మాట్లాడారు. ఉచికత కరెంట్ తో రైతుల కష్టాలు తీరాయని, కెసిఆర్ హయాంలో రైతులు ధైర్యంగా పంటలు సాగు చేస్తున్నారని కొనియాడారు. బావులకు, బోర్లకు మీటర్లు పెడతామని మోడీ ప్రభుత్వం అంటోందని మండిపడ్డారు.

సిఎం కెసిఆర్ రూ.11 వేల కోట్ల పెన్షన్లకు ఇచ్చారని, కేంద్రం మాత్రం రూ.210 కోట్లు మాత్రమే ఇచ్చిందని స్పష్టం చేశారు. గత పాలకుల కాలంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో? పోతుందో? తెలియదని, రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందని హరీష్ రావు తెలిపారు. బావులకు మీటర్లు కావాలంటే బిజెపికి ఓటేయాలని, ఉచిత విద్యుత్ కావాలంటే టిఆర్ఎస్ కు ఓటేయాలని సూచించారు. ఏడాదికి ఎకరానికి పది వేల రూపాయల పంటపెట్టుబడి సాయం చేస్తున్నామని, ప్రతీ ఎకరానికి నీళ్లు టిఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు.   ఈ ర్యాలీలో ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంఎల్ఎ మానిక్ రావు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News