Home తాజా వార్తలు రేపు నల్లమల ఆదివాసీల కోసం ఉచిత వైద్య శిబిరం

రేపు నల్లమల ఆదివాసీల కోసం ఉచిత వైద్య శిబిరం

Free medical camp for Nallamala tribalsనాగర్‌ కర్నూల్‌ : నల్లమల ఆదివాసీల కోసం బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు పాలమూరు యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఎల్‌బీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ మంగళవారం మీడియాకు తెలిపారు. గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌ ఆదేశాల మేరకు లింగాల మండలం బౌరాపూర్‌లో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.. బౌరాపూర్, అప్పాపూర్ గ్రామాలతో పాటు పరిసర నల్లమల చెంచుపెంటల్లో నివాసం ఉండే ఆదివాసీలు ఈ ఉచిత వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. ఈ  కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కలెక్టర్‌ శర్మన్‌, ఆదివాసీల పరిశోధకురాలు ప్రొఫెసర్‌ గూడూరు మనోజ, జిల్లా వైద్యాధికారి సుధాకర్‌ లాల్‌, మహబూబ్‌నగర్‌ హెల్త్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌ కిషన్‌ పాల్గొంటారని ఆయన చెప్పారు.