Tuesday, April 23, 2024

కరోనా కాలంలో అండగా నిలుస్తున్న యాంటీ కరప్షన్ సంస్ద

- Advertisement -
- Advertisement -

Free medicines to pregnant women through Anti-Corruption organization

మన తెలంగాణ, హైదరాబాద్ : ప్రస్తుతం కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్ అత్యంత వేగంగా విస్తరిస్తూ ఎంతోమందిని వణికిస్తుంది. ఇలాంటి సమయంలో నిత్యం మందులు వాడే గర్భిణీలు, మహిళలు, వృద్దులు బయటక వెళ్లలేక అవస్దలు పడుతున్నారని వారి అవసరాలు తీర్చేందకు యూత్‌ఫర్ యాంటీ కరప్షన్ సంస్ద ముందుకు వచ్చినట్లు ఫౌండర్ పల్నాటి రాజేంద్ర నేత తెలిపారు. ఎవరికైనా అత్యవసర మందులు కావాలంటే నేరుగా తమ సంస్దను సంప్రదించాలని,వాటప్స్ నెంబర్‌కు కావాలసిన మందుల వివరాలు పంపిస్తే తాము ఇంటివద్దకే ఉచితంగా తీసుకొచ్చి ఇస్తామని చెప్పారు. గత నెల నుంచి ఈఉచిత మెడిసిన్ సర్వీసును తమ సంస్ద సభ్యులు చేస్తున్నారని, రెండు తెలుగు రాష్ట్రాల్లో మా కార్యక్రమాలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలో తమ వాలంటీర్లు ఉచితం సేవలు నిత్యం అందిస్తున్నారని వెల్లడించారు. కరోనా సమయంలో ఇలాంటి వారికి సేవ చేయడం తమ బాధ్యతని అంటున్నారు. ప్రశ్నించడమే కాకుండా అత్యవసర సయమంలో ఎదుటి వారి కన్నీళ్లు తుడవడమే తమ సంస్ద ముఖ్య ఉద్దేశ్యమన్నారు. మాబృందంలో 24గంటలు పనిచేయడానికి సభ్యులు ఉన్నారని, సంప్రదించాల్సిన నెంబర్లు 8499031234, 7799553385 వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News