Thursday, April 25, 2024

ఉపాధే లక్ష్యంగా ఉచిత నైపుణ్య శిక్షణ

- Advertisement -
- Advertisement -

Free skill training aimed at employment

నగర యువతకు
ఉపాధే లక్ష్యంగా ఉచిత నైపుణ్యత శిక్షణ
ప్రణాళిక సిద్దం చేసిన జిహెచ్‌ఎంసి
ప్రతి యేటా 600 మందికి శిక్షణ
మహిళలకు ప్రాముఖ్యత
ప్రయోగాత్మకంగా కూకట్ పల్లి జోన్ లో ఏర్పాటు

హైదరాబాద్: చదువు ఉన్నా ఉద్యోగం లేదా, ఇందుకు నైపుణ్యం లేకపోవడమే కారణమా, అయితే ఇలాంటి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్షంగా జిహెచ్‌ఎంసి సరికొత్త ప్రణాళికను సిద్దం చేసింది. స్లమ్ ఏరియాలో నివసించే యువత ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ సరైన అవకాశాలు రాక ఉపాధిలో వెనుకబడిన వారందరికీ ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వడమే కాకుండా వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా సుస్థిరమైన జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు జిహెచ్‌ఎంసి కృషి చేస్తోంది. పూణేకు చెందిన లైట్ హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్ (ఎల్‌సిఎఫ్) సంస్థ ద్వారా 18 ఏళ్ల నుండి 35 ఏళ్ల లోపు వారందరికీ వివిధ రంగాల్లో నైపుణ్యత శిక్షణ ఇప్పించేందుకు శ్రీకారం చుట్టింది. ద్వారా ఈ శిక్షణ పొందినవారు స్వయం ఉపాధితో పాటు వివిధ కంపెనీలలో ప్లేస్ మెంట్ ద్వారా ఉపాధి సైతం ఈ సంస్థ కల్పించేలా ఒప్పందం చేసుకుంది. ప్రయోగాత్మకంగా చేపట్టనున్న ఈ శిక్షణ కార్యక్రమాన్ని కూకట్ పల్లి జోన్ లో ఏర్పాటు చేయనున్నారు.

పైలట్ ప్రాజెక్ట్ భాగంగా చేపట్టనున్న ఈ శిక్షణా కార్యక్రమానికి సంబంధించి ఏడాది పాటు ఎలాంటి అద్దె లేకుండా లైట్ హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్ కి సర్కిల్ 21లో గల హుడా కాలనీ లో గల మోడల్ మార్కెట్ బిల్డింగ్ జిహెచ్‌ఎంసి కేటాయించింది. 18 నుంచి 35ఏళ్ల లోపు కనీస విద్య అర్హత గల వారందరికీ ఇష్టమైన, ఆసక్తి గల రంగాల్లో వారిని నిష్ణాతులుగా తీర్చిదిద్ది లైట్ హౌస్ సంస్థ వివిధ భాగస్వామ్య సంస్థలలో ఉపాధి కల్పిస్తుంది. ఇప్పటికే ఈ సంస్థ మహారాష్ట్రలోని పూణే నగర పాలక సంస్థతో ఒప్పందం చేసుకొని వేలాది మందికి ఆయా భాగస్వామ్య సంస్థల ద్వారా గాని ఆయా పరిశ్రమలు, కంపెనీలలో ఉపాధి కల్పనకు కృషి చేసింది.అక్కడ11,000 మంది నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్ చేసుకోగా 7,200 మందికి ప్లేస్ మెంట్ తో పాటుగా స్వయం ఉపాధి కల్పించారు.

ప్రతి ఏటా600 మందికి శిక్షణ 
కూకట్‌పల్లిలో పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించన నైపుణ్య శిక్షణలో భాగంగా ఈ ఏడాది 600 మందికి వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా ఐటి సేవలకు సంబంధించిన ప్రోగ్రాం జావా, సి సి ఎన్ ఏ, డేటా ఎంట్రీ ఆపరేటర్, నాన్ వాయిస్ బి పీ ఓ బ్లూ కలర్ కోర్సు, వెబ్ డిజైనింగ్, కంప్యూటర్ హార్డ్ వేర్ అండ్ నెట్ వర్కింగ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. అదేవిధంగాజనరల్ డ్యూటీ అసిస్టెంట్, రెండు, మూడు, నాలుగు చక్రాల వాహనాల రిపేరింగ్, ఫోటోగ్రఫీ, మొబైల్ రిపేరింగ్, బేకరి తయారీ లాంటి ఇతర ప్రోగ్రాములు ఎన్రోల్మెంట్ అయిన వారికి నైపుణ్యత కల్పిస్తారు. నర్సింగ్, కుక్కింగ్, బ్యూటీ పార్లర్ లు, ఫిట్నెస్ ట్రైనర్ సేర్వీస్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ సంబంధించినకోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇవే కాకుండా అభ్యర్థులకు ఆసక్తి ఇష్టమైన కోర్సులకు ఈ సంస్థ వద్ద లేకున్నా ఈ సంస్థే ఫీజులు చెల్లించి ఇతర శిక్షణ సంస్థల ద్వారా శిక్షణ ఇప్పించనున్నారు. ఎంపిక నుండి నైపుణ్యత, శిక్షణ తో పాటు ప్లేస్మెంట్ ఇప్పించే వరకు ఈ సంస్థ బాధ్యత తీసుకుంటుంది. ఇందుకు సంబంధించి ఇక్కడ స్థానికంగా ఉన్న కంపెనీలు, పరిశ్రమలతో భాగస్వామ్యం చేసుకోనుంది.

శిక్షణ ఇవ్వనున్న వివిధ కోర్సులు 
1. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ : ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ – ఎస్.ఎస్.ఎఫ్
2. లాంగ్ స్టిక్ సెక్టార్ (సిసిఈ/ ప్రాస్సెస్ ఎగ్జిక్యూటివ్ ) లాంగ్ స్టిక్ సెక్టార్ సర్టిఫికెట్ కోర్సు
3. అకౌంట్ ఎగ్జిక్యూటివ్: అకౌంట్ ఎక్జిక్యూటివ్ – ఎల్.సి
4. ఆఫీస్ ఎగ్జిక్యూటివ్:ఆఫీస్ ఎక్జిక్యూటివ్ – ఎల్.ఆర్
5. బిఎప్‌ఎస్‌ఐ బిజినెస్ డెవలప్మెంట్ ఎక్జిక్యూటివ్
6.సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్, వెబ్ డిజైనింగ్, జావా ఫుల్ స్ట్రక్,సాఫ్ట్ వేర్ టెస్టింగ్,పైథాన్ – టా ఫిట్,కోర్ జావా – టా ఫిట్
7. వెబ్ డెవలప్మెంట్: వెబ్ పొగ్రాంతో పాటు పి.హెచ్.పీ, అంగుళర్ – టా ఫిట్
8. నర్సింగ్ అసిస్టెంట్, కేర్, రికవరీ, హోమ్ కేర్ , సర్టిఫికెట్ కోర్సులు.

ఎలక్ట్రీషియన్ కోర్సులు 
1. ఎలక్ట్రీషియన్
2.సర్టిఫికెట్ కోర్సు లు,ఎలక్ట్రికల్ వైర్ మెన్ ట్రేడ్,ఎలక్ట్రికల్ సర్వీస్
కంప్యూటర్ హార్డ్ వేర్ అండ్ నెట్ వర్కింగ్ కోర్సులు ః
1. హార్డ్ వేర్ అండ్ నెట్ వర్కింగ్ సర్టిఫికెట్ కోర్సు
2. కంబో – హార్డ్వేర్ నెట్వర్కింగ్.
3. మొబైల్ రిపేరింగ్

ఫిట్నెస్ ట్రైనర్ అండ్ న్యూట్రిషన్ 
1. న్యూట్రిషన్ ఎక్స్ పర్ట్,ఫిట్నెస్ ట్రైనర్ కమ్ న్యూట్రిషన్ ఎక్స్ పర్ట్( కాంబో కోర్స్)
12. హోం అప్లియాన్స్ కోర్స్, హోమ్ అప్లయెన్సెస్ రిపేరింగ్ సర్టిఫికెట్ కోర్సు.
13. హోమ్ అప్లయెన్సెస్ రిపేరింగ్ కోర్స్.
14. బ్యూటీ అండ్ వెల్నెస్, బేసిక్ అండ్ బ్యూటీ పార్లర్, బ్యూటీ అండ్ కాస్మోటో లోజి.
15. గ్రాఫిక్ అండ్ వెబ్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్ ప్రోగ్రామ్, గ్రాఫిక్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ సర్టిఫికేట్ కోర్స్.
16. వయో వృద్దుల సంరక్షణ కోర్సులను ఆఫర్ చేస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News