Home Default కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ

కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ

Free Training In Computer Coursesహైదరాబాద్: నిరుద్యోగ యువతకు కంప్యూటర్ కోర్సులలో ఉచిత శిక్షణ ఇస్తామని లెటజ్ సర్వ్ ఫౌండేషన్ ప్రతినిధి మహమూద్ అలీ ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎమ్మెస్ ఆఫీస్, ఇంటర్నెట్, డిటిపి, స్పోకెన్ ఇంగ్ల్లిష్, కెరీర్ గైడెన్స్ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తామని ఆయన వెల్లడించారు. అంతేకాక ప్రతి శనివారం పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక శిక్షణ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ప్రభుత్వం జారీ చేసే సర్టిఫికెట్ అందజేస్తామని ఆయన చెప్పారు. పైన పేర్కొన్న  కోర్సులలో శిక్షణ పొందేందుకు 8, 10వ తరగతి విద్యార్థులు, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ విద్యార్థులు అర్హులని ఆయన వెల్లడించారు. పూర్తి  వివరాల కోసం శ్రీరాంనగర్‌లోని ఎస్‌డి పాయింట్ హోటల్ సమీపంలోని తమ కార్యాలయంలో సంప్రదించాలని, లేనిపక్షంలో 9849731084 నంబరుకు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.

Free Training In Computer Courses For Unemployed Youth