Home తాజా వార్తలు రూ.500 దొంగతనం?… 14 ఏళ్ల బాలుడిని చంపిన స్నేహితుడి తల్లి

రూ.500 దొంగతనం?… 14 ఏళ్ల బాలుడిని చంపిన స్నేహితుడి తల్లి

affair

 

భువనేశ్వర్: ఐదు వందల రూపాయలు దొంగతనం చేశాడనే అనుమానంతో 14 ఏళ్ల బాలుడిని స్నేహితుడి తల్లి కొట్టి చంపిన సంఘటన ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కియాపానోపోషి గ్రామంలో రాజన్ బహేరా (14) అనే విద్యార్థి ఏడో తరగతి చదువుతున్నాడు. అతడు ఆడుకోవడానికి తన స్నేహితుడు ఇంటికి వెళ్లాడు. స్నేహితుడి ఇంట్లో ఐదు వందల రూపాయలు దొంగతనం జరిగినట్టు అతడి తల్లి శష్మితా బహేరా గుర్తుంచి కుమారుడిని అడిగింది. తల్లి లేనప్పుడు ఇంట్లోకి రాజన్ ఒక్కడే వచ్చాడని కుమారుడు సమాధానం చెప్పాడు. శష్మిత వెంటనే రాజన్‌ ను కర్రతో కొట్టి తీవ్రంగా గాయపరిచింది. తీవ్రంగా గాయపడిన రాజన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కరణ్‌జియా పోలీస్ స్టేషన్ అధికారి సత్యనారాయణ కోలా ఘటనా స్థలానికి చేరుకొని ఆమెపై 302 ఐపిసి సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.