Home ఆఫ్ బీట్ వీడియోలు డ్యామిట్.. కథ అడ్డం తిరిగింది !(వీడియో)

డ్యామిట్.. కథ అడ్డం తిరిగింది !(వీడియో)

Frog Swallow Snakeపెద్ద జీవులు చిన్న జీవులను ఆహారంగా తీసుకోవడం అనేది జీవుల ఆహారపు గొలుసులో జరిగే సాధారణ ప్రక్రియ. అది సృష్టి రహాస్యం కూడా. అలాంటిది ఓ చిన్న జీవి.. ఏకంగా పెద్ద జీవిని మింగేందుకు ప్రయత్నించడం విడ్డూరం. ఎపిలోని కృష్ణా జిల్లా చందర్లపాడు మండలంలోని రామన్నపేటలో ఈ వింత సంఘటన చోటుచేసుకుంది. మనం కామన్ గా బయట చూసేది కప్పను పాము మింగడం. కానీ, రోటీన్ కు భిన్నంగా ఓ కప్ప ఏకంగా పామును మింగేందుకు ప్రయత్నించింది. సుమారు రెండు అడుగుల పొడవు ఉన్న పామును మింగలేక, కక్కలేక ఇబ్బంది పడిందా కప్ప. దీన్ని కొందరు వీడియో తీసి అంతర్జాలంలో పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది.డ్యామిట్ కథ అడ్డం తిరిగిందే అనిపించేలా ఉన్న ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Frog Swallow Snake In Krishna District

(Courtesy By Bharat Today )