Wednesday, March 22, 2023

19 నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా ఎర్రజొన్నల కొనుగోలు

- Advertisement -

doti

*క్వింటాలుకు రూ.2300
కొనుగోలు చేస్తాం
*వ్యవసాయ మార్కెట్‌లో
కొనుగోలు కేంద్రాల
ఏర్పాటు
*వ్యవసాయ శాఖ మంత్రి
పోచారం శ్రీనివాస్‌రెడ్డి

మనతెలంగాణ/నిజామాబాద్ బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు మార్క్‌ఫెడ్ ద్వారా ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఎర్రజొన్నలను క్వింటాలుకు రూ.2300తో కొనగోలు చేస్తామని, మొదటి దశలో 5 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ఎర్రజొన్నల కొనుగోలు విధి విధానాలపై అధికారి నివాసం లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పోచా రం మాట్లాడుతూ నిజామాబాద్, ఆర్మూర్, వేల్పూర్, కమ్మర్‌పల్లి, బాల్కొండ వ్యవసాయ మార్కెట్ కేంద్రాలలో సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, రైతులు మార్కెట్‌కు ఎర్రజొన్నలను తీసుకురావడానికి టోకెన్ పద్దతిని అమలు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు గ్రామాలలో పర్యటించి రైతులు సాగు చేసిన పంటలను పరిశీలించి విస్తీర్ణం, దిగుబడి ఆధారంగా టోకెన్లను జారీ చేస్తామని, రైతులు తమ సరుకును కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తెలిపారు. ప్రతి రైతు తప్పనిసరిగా ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను అధికారులకు తెలిపాలన్నారు. అమ్మిన పంట తాలుకు నగదును ఆర్‌టిజిజీఎస్ ద్వారా నేరుగా రైతుల ఖాతాలో జమచేయబడుతుందని, రైతులు మధ్యవర్తులను, దళరులను నమ్మవద్దని సూచించారు. గౌడాన్లు, కొల్డ్ స్టోరేజీలలో నిల్వ ఉన్న గత ఏడాది నిల్వలను కొనుగోలు చేయమని, ఎవరైనా పాల నీళ్ల్లలను అమ్మడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఇతర రాష్ట్రాల నుంచి ఎర్రజొన్నల దిగుమతులను అనుమతించమని, పోలీసు శాఖ సహకారంతో చెక్‌పోస్టులు, తనిఖీలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎర్రజొన్నల కొనుగోలు, సరఫరా, తరలింపు నిల్వ చేయడంపై వ్యవసాయ, రెవె న్యూ, మార్కెటింగ్, మార్క్‌ఫెడ్ అధికారులు నిత్యం పర్యవేక్షిస్తారని, నిజమైన రైతులు ఆందోళన చెందవద్దని, చివరి గింజ కొనే వరకు కొనుగోలు కేంద్రాలను కొనసాగిస్తామని, రైతులు సహకరించాలని అన్నా రు.  ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్ధసారది, కమిషనర్ జగన్మోహన్, అడిషనల్ డైరెక్టర్ విజయ్‌కుమార్, మార్క్‌ఫెడ్ జీఎం రాములు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News