Home ఆదిలాబాద్ పల్లె నుంచి పైలట్ దాకా

పల్లె నుంచి పైలట్ దాకా

From the village to the pilot the Giripatrudu

మన తెలంగాణ/ఆదిలాబాద్ : ప్రతి ఒక్కరూ కలలుకంటారు… కనీ కలలు నిజం చేసుకుని అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడీ గిరిపత్రుడు. ఎలాంటి సౌకర్యాలు లేని కుగ్రామంనుంచి ఎదిగి పైలట్‌గా నిలిచి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచాడు కిరణ్. తల్లిదండ్రుల ప్రోత్సాహం, గ్రామస్తుల తోడ్పాటుతో తాను ఈ విజయాన్ని సాధించానని ఆ యువకుడు గర్వంగా చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పరిధిలోని ఏందా నడ్డంగూడ తండావాసి అయిన రాథోడ్ ప్రకాష్, అనసూయల ఏకైక కుమారుడైన రాథోడ్ కిరణ్‌కుమార్‌కు ఇటీవల ఎ౩20ఎయిర్‌బస్‌కు పైలట్‌గా ఉద్యోగానికి ఎంపికకావడంతో అతని కుటుంబ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తాను పడ్డ కష్టానికి సరైన ఫలితం దక్కిందని పైలట్‌గా ఎదిగిర కిరణ్‌తోపాటు తండ్రి రాథోడ్ ప్రకాష్ ఉబ్బితబ్బిబ్బబుతున్నారు. ఇష్టపడి ఇంటర్‌తర్వాత బిఎస్‌సి ఏవియేషన్ డిగ్రీని అందుకుని అటుతర్వాత ఉన్నత స్థాయికి ఎదిగిన గిరిపుత్రుని విజయగాధపై మనతెలంగాణా ప్రత్యేక కథనం. ఎక్కడో గ్రామంలో పుట్టి ఉన్నత శిఖరాలనందుకున్న అతని విజయంపై చిన్నపాటి గిరిజనతండాలో సంబరాలు జరుపుకుంటున్నారు. పుట్టింది కుగ్రామమైన తన లక్షాన్ని పసాధించుకరునేందుకు అహోరాత్రులు కష్టపడ్డారు.

కిరణ్‌కుమార్‌కు పైలట్ ఉద్యోగం అంత సులువుగా దరిచేరలేదు. దీని వెనకాల కఠోర శ్రమతోపాటు ఎంచుకున్న రంగం ఇంతటిస్థాయికి తెచ్చిందని, ఎలాంటి సౌకర్యాలు లేని తండాలో ఏదోఒకటి సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించాలనేతపన, ఆశ,కసితోనే ఈ రంగంవైపు అడుగులు వేశానని చెప్పాడు. తండ్రి ప్రకాష్ తొలుత పోలీస్ శాఖలో ఉద్యోగానికి ఎంపికకాగా, ఆ పదవికి స్వస్థిచెప్పి అడ్వకేట్‌గా నిలిచి పోగా, తల్లి వైద్యారోగ్యశాఖలో ఉద్యోగం చేస్తోంది. కిరణ్‌కుమార్ ఆసక్తిని గమనించిని తల్లి దండ్రులు క్రిష్టాజిల్లా ఉయ్యూరులో పదో తరగతి వరకు చదిపించగా, అనంతరం హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో బిఎస్సీ ఏవియేషన్, నల్సార్ విశ్వ విద్యాలయంలో ఏవియేషన్‌లా, కమర్షియల్ పైలట్‌గా అకాడమీలో మూడేళల శిక్షణ అనంతరం చండీఘర్డ్‌లో మల్టీ ఇంజనీర్‌గా ఒక ఏడాది శిక్షణ పొందాడు. ఈసందర్భంగా జెట్ ఎయిర్, టైప్‌రైటింగ్, ఎ౩ 20ఎయిర్‌బస్ ప్రత్యేక శిక్షణ, యూరప్‌లో హెవీ లైసెన్సు ఆరు నెలల్లోనే పూర్తిచేశాడు. ప్రస్తుతం స్వదేశంలో 90ఏయిర్‌లైన్‌లో అన్నివిధాలా పరీక్షలు అధిగమించి ప్రథమ స్థాయిలో ఎ320 ఎయిర్‌బస్ నడిపేందుకు పైలట్‌గా ఎంపికయ్యాడు. ఈనెల 24 ఉద్యోగంలో చేరడతో చిన్నపాటి తండాలో సంబరాలు జరుపుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆశలను, కలలను నిజంచేస్తూ 20 ఏళ్లనాటి తన లక్షాన్ని కిరణ్‌కుమార్ చేరుకున్నాడు. రాష్ట్రంలోనే ఆదిలాబాద్ జిల్లానుంచి పైలట్ ఉద్యోగం సాధించిన మొదటి వ్యక్తి కిరణ్‌కుమార్.