Home రాష్ట్ర వార్తలు గ్రామస్వరాజ్యమే..

గ్రామస్వరాజ్యమే..

  • గ్రామ స్వపరిపాలనే తెలంగాణ ప్రభుత్వ లక్షం : సబర్మతి ఆశ్రమంలో మంత్రి కెటిఆర్
  • చరఖా బహూకరించిన ఆశ్రమ విద్యార్థులు

KTR-Gujarat

హైదరాబాద్ : టెక్స్‌టైల్స్ ఇండియా-2017 సమావేశాలలో పాల్గొనేందుకు గుజ రాత్‌కు వెళ్లిన రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు శనివారం ఉదయం జాతిపిత మహాత్మాగాంధీ జీవించిన సబర్మతి అశ్రమాన్ని సందర్శించారు. మహాత్ముడి ఇల్లు, అశ్రమంలోని పాఠశాలను సం దర్శించి మహాత్మా ఉపయోగించిన వస్తువులను, లేఖలను పరిశీలించారు. అశ్రమానికి వచ్చిన మం త్రికి అక్కడి విద్యార్థులు ఒక చరఖాను బహుకరిం చారు. గాంధీ మహాత్ముడి జీవన విధానం అందరికీ అదర్శమని మంత్రి అన్నారు. మహాత్ముడు చూపిన బాటలోనే గ్రామాల అభివృద్ధికి ప్రయత్నాలు చేస్తున్నమన్నారు. మంత్రి, తెలంగాణ ప్రభు త్వ పథకాల ప్రాథమిక లక్ష్యం గ్రామ స్వరాజ్య స్థాపనే అన్నారు. అహ్మమ దాబాద్‌లోని సబర్మతి నదిని అభివృద్ధి పరచడం ద్వారా ఏర్పాటు చేసిన సబ ర్మతి రివర్ డెవెలప్‌మెంట్ ఫ్రంట్‌ను మంత్రి కెటిఆర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, జిహెచ్‌ఎంసి, హెచ్ ఎండిఎ కమిషనర్లు, వాటర్ వర్క్ ఎండి ఇతర అధికారులు సందర్శించారు. మూసీ అభివృద్ధి, సుందరీకణపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపి స్తున్న నేపథ్యంలో సబర్మతి నది అభివృద్ధి నమూనాను అధ్యయనం చేశారు. ఇందుకోసం రివర్ ప్రంట్ అధికారులు మంత్రి బృందానికి వివరాలు అంద జేశారు. సుందరీకణ కోసం ఎదురైన సమస్యలు, నదీ ఒడ్డున అప్పటి దాకా ఉన్న జనావాసాలు తరలింపు, మెత్తం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు పట్టిన సమ యం వంటి అంశాలను మంత్రి తెలుసుకున్నారు.
ప్రోత్సహాకాలు ఇచ్చేందుకు సిద్ధం: ఇండియా 2017 సదస్సులో తెలంగాణ రాష్ట్ర షెషన్ మంత్రి కెటి రామారావు ప్రజెంటేషన్ ఇచ్చారు. వరంగల్ టెక్స్ టైల్ పార్కు గురించి ప్రత్యే కంగా ప్రస్తావించారు. టెక్స్ టైల్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. ఒకవైపు టెక్స్ టైల్ రంగానికి ప్రాధాన్యత ఇస్తునే చేనేతను అదుకుంటున్నామన్నారు.