Friday, April 19, 2024

పరాఠాలకు 18 శాతం జిఎస్‌టి సబబే

- Advertisement -
- Advertisement -

Frozen Parathas 'Quite Different' From Rotis,

చపాతీలకన్నా అవి భిన్నమైనవని స్పష్టీకరణ

గాంధీనగర్: మీరు ఏదయినా హోటల్‌కు వెళ్లినప్పుడు చపాతీలకు బదులు పరాఠాలు ఆర్డరిచ్చారంటే చాలు మీ బిల్లులో వాటిపై 18 శాతం జిఎస్‌టి చెల్లించక తప్పదు. చపాతీలకు 5 శాతం జిఎస్‌టిల వర్తిస్తుంటే పరాఠాలకు మాత్రం 18 శాతం జిఎస్‌టి ఏమిటని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెతుత్తున్నాయి. అయితే చపాతీ లేదా రోటీలకు, పరాఠాలకు తేడా ఉందని, అందుకనే ఇవి వేర్వేరు జిఎస్‌టి శ్లాబులకిందికి వస్తాయని గుజరాత్ అపిలేట్ ఫర్ అడ్వాన్స్‌డ్ రూలింగ్ స్పష్టం చేసింది. అథారిటీ ఫర్ అడ్వాన్స్‌డ్ రూలింగ్ ఇచ్చిన ఆదేశాలపై అహ్మదాబాద్‌కు చెందిన వడిలాల్ లిమిటెడ్ చేసిన అపీలుపై ఈ వివరణ ఇచ్చింది. వడీలాల్ ఇండస్ట్రీస్ చేసిన వాదనలో తాము 8 రకాల పరాఠాలను తయారు చేస్తున్నట్లు తెలిపింది.

వీటన్నిటిలో ప్రధానంగా వాడుతున్నది గోధుమ పిండేనని, అందువల్ల రోటీలకు వర్తించే జిఎస్‌టి శ్లాబులను వీటికీ వర్తింపజేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో గుజరాత్ అథాటీ ఆఫ్ అడ్వాన్స్‌డ్ రూలింగ్ ( గార్)ఇచ్చిన తీర్పును అపిలేట్ అథారిటీ సెప్టెంబర్ 15న సమర్థించింది. అపీలుదారు సరఫరా చేసే పరాఠాలకు, ప్లెయిన్ చపాతీ లేదా రోటీలకు తేడా ఉందని తెలిపింది. ఈ పరాఠాలను సాధారణ చపాతీ లేదా రోటీ కేటగిరీలోకి వస్తాయని పరిగణించరాదని చెప్పింది. పరాఠాలకు సరైన వర్గీకరణ చాప్టర్ హెడింగ్ 2016లో ఉందని స్పష్టం చేసింది. ప్యాకేజ్డ్ లేదా ఫ్రోజెన్ పరాఠాలను మూడు లేదా నాలుగు నిమిషాల పాటు బంగారు మట్టి రంగులోకి మారే వరకు కాల్చవలసి ఉంటుందని గార్ గత జూన్‌లో ఇచ్చిన ఆర్డర్‌లో పేర్కొంది. ఈ కంపెనీ తయారు చేసే వేర్వేరు పరాఠాల్లో గోధుమ పిండిని వేర్వేరు పరిమాణాల్లో వాడతారని తెలిపింది. అందుకే పరాఠాలు 18 శాతం జిఎస్‌టి శ్లాబ్‌లోకి వస్తాయని తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News