Saturday, April 20, 2024

సామాన్యుడికి పద్మపురస్కారం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సోమవారం రాష్ట్ర పతిభవన్‌లో జరిగిన పద్మపురస్కారాల బహుకరణ దశలో తెల్లటి ధోవతి, చొక్కా, కండువా, కాళ్లకు చెప్పులు లేని 68ఏండ్ల వ్యక్తి హరేకల హజబ్బా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయనకు రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ అందుకున్నారు. మంగళూరు వీధులలో పండ్లు అమ్ముకుని బతికే ఈ వ్యక్తి నిరుపేదనే, అయితే తను పండ్లు అమ్మడం ద్వారా వచ్చేదాంట్లోనే కొంతవేనుకేస్తూ వచ్చాడు. పేద విద్యార్థులు చదువుకునేందుకు ఈ సొమ్ముతో ఓ పాఠశాల కట్టించాడు. ఈ విధంగా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆయన సేవను గుర్తించి ఇప్పుడు పద్మశ్రీ పురస్కారం ఆయన సేవాఫలంగా దక్కింది. మంగళూరు తాలూకాలోని న్యూపడపు గ్రామానికి చెందిన ఈ వ్యక్తి మంగళూరులో బత్తాయిలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. జీవితంలో చదువు విలువ ఏమిటనేది తన అనుభవాలతో తెలుసుకుని తన లాగా ఎవరూ నిరక్షరాసులుగా మారకూడదని కోరుకున్నాడు. దీనికి అనుగుణంగా కష్టపడి స్కూల్ నిర్మాణం చేపట్టాడు. ఈ స్కూల్ ద్వారా ఎందరో ఇప్పుడు విద్యావంతులు అయ్యారు. ఓసారి ఆయన పండ్లు అమ్ముతుండగా ఓ విదేశీ జంట వచ్చింది. పండ్ల రేటును ఆంగ్లంలో అడిగింది. అయితే ఈ భాష తెలియక ఆయన కన్నడంలో బదులిచ్చారు. దీనితో వారు విసుగుచెంది ఈసడించుకుంటున్నట్లుగా వెళ్లడంతో మనసు చివుకు మన్న ఆయన విద్యలేకపోతే వింత బతుకే అనుకుని తన పరిస్థితి ఇతరులలో కొందరికైనా రాకుండా చేసేందుకు స్కూలు నిర్మాణానికి విశేషంగా పాటుపడ్డారు. పురస్కారం ఇతరత్రా గుర్తింపు కోసం తాను ఏమీ చేయలేదని, తనకు పద్మ అవార్డు వచ్చిందని ఇతరుల ద్వారా తెలిసిందని, తనను దక్షిణ కర్నాటకకు చెందిన ఓ ఎంపి ఢిల్లీకి తీసుకువచ్చారని, విమాన ఖర్చులు ప్రభుత్వం భరించిందని పురస్కారం తీసుకున్న తరువాత హజబ్బా తెలిపారు.

Fruit Seller Harekala Hajabba Received Padma Award

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News