Friday, April 19, 2024

పండ్ల ధరలకు రెక్కలు

- Advertisement -
- Advertisement -
Fruits and flowers price hike in Hyderabad
గడ్డఅన్నారం మార్కెట్ మూసివేతతో పెరిగిన ధరలు
ఆందోళనలో వినియోగదారులు

హైదరాబాద్: నగరంలోని పలుపండ్ల దుకాణాలోని పండ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం సుమారు 15 రోజుల నుంచి గడ్డన్నారం పండ్ల మార్కెట్ మూతపడటమే. మార్కెట్‌ను బాటసింగా రం ప్రాంతానికి తరలించే కార్యక్రమంలో భాగంగా గత నెల 25న మార్కెట్‌ను 5 రోజులు పాటు అధికారులు మూసివేసిన సంగతి తెలిసిందే. బాటసింగారం మార్కెట్‌లో కనీస సౌకర్యాలు కల్పించకుండా వెళ్ళేది లేదని కమిషన్, ఏజెంట్లు, వ్యాపారులు ఆందోళనలు చేయడమే కాకుండా ఈ అంశంపై హై కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు అక్టోబర్ 4 వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 4న మరో సారి విచారణ జరిపిన క్షేత్రస్థాయిలో నివేదికను 18 కి సమర్పించాలని, అప్పటి వరకు మార్కెట్‌ను అక్కడే కొనసాగించాలని తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే అధికారులు మాత్రం మార్కెట్‌ను తిరిగి ఓపెన్ చేయకపోవడంతో దానికి మీద ఆధారపడే అనేక మంది రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. దసరా పండగ సందర్భంగానైనా తిరిగి ప్రారంభమవుతుందనుకున్న వినియగదారులు, వ్యా పారులు ఆశలు నీరు చల్లినట్లయ్యింది.

ఒక వైపు మా ర్కెట్ మూసివేత, మరో వైపు దసరగా పండగను ఆసరాగా తీసుకున్న కొంత మంది వ్యాపారులు పండ్ల ధరలను అమాంతంగా పెంచివేశారు. ఇదేమిటని ప్ర శ్ని ంచి ప్రశ్నిస్తే ప్రతి రోజు తాము సాధారణ రేట్లకే అమ్ముతున్నామని ఇటువంటి సమయాల్లోనే కదా నాలుగు డబ్బులు సంపాదించుకునేది అంటూ తెలివిగా సమాధానం చెబుతున్నారు. పండ్ల ధరలు పెరిగిన వాటిని కొనుగోలు చేయక తప్పడం లేదని వినియోగ దారులు వాపోతున్నారు. నిన్న మొన్నటి దాక డజన్ అరటి పళ్ళు రూ. 35 నుంచి 40కు పలుకగా గత రెండు రోజుల నుంచి వీటి ధర డజను పండ్లు రూ. 55 నుంచి 60కి చేరింది. అదే విధంగా కిలో ద్రాక్ష(గ్రీన్) రూ. 60 నుంచి 150, కర్భూజ కిలో రూ.35 నుంచి 90, సపోట కిలో రూ. 50 నుంచి రూ.125, ఒక్కో యాపిల్ రూ.15 నుంచి 30,బత్తాయి డజన్ రూ.70 నుంచి 150కి పెంచేశారు.

ఇప్పుడు వీటి ధరలు ఈ విధంగా ఉంటే శుక్రవారం మరింతగా పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా పండుగల సమయంలో పూల పండ్ల ధరలు పెరగడం సాధారణమే. కాని మార్కెట్ మూసివేత సాకుతో వాటి ధరలను వ్యాపారులు మరింతగా వ్యాపారులు పెంచేశారని కొనుగోలు దారులు వాపోతున్నారు. పండగ సందర్భంగా ధరలు పెరిగినా కొనక తప్పడం లేదంటున్నారు. కొద్ది రోజుల క్రితం రోడ్ల పక్కన ఉండే పండ్ల దుకాణలు, మోబైల్ పండ్ల దుకాణాల్లో ధ రలు చాలా తక్కువగా ఉండేవని కాని వారు కూడా పండగ సందర్భంగా ధరలను ఒక్క సారిగా పెంచేశారని వాపోతున్నారు.ఏది మైనా పండ్లధరలు సామాన్య మానవుల అందుబాటులో లేకుండా పోయాయని పలువురు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News