Home బిజినెస్ సెప్టెంబర్‌లో 10 శాతం పెరిగిన ఇంధన డిమాండ్

సెప్టెంబర్‌లో 10 శాతం పెరిగిన ఇంధన డిమాండ్

petrol

న్యూఢిల్లీ: సెప్టెంబర్‌లో దేశీయ ఇంధన డిమాండ్ 9.9 శాతం పెరిగింది. గత నెలలో పెట్రోలు, డీజిల్ వాడకం మరింతగా పెరిగింది. దీంతో ఏడాది కాలంలో ఈ స్థాయిలో ఇంధనం వినియోగం ఉండడం ఇదే.. కేంద్ర చమురు మంత్రిత్వశాఖ ఈ గణాంకాలను వెల్లడించింది. ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం, ఏడాది క్రితం ఇదే సమయంలో 14.78 మిలియన్ టన్నులు పెట్రోలియ ఉత్పత్తుల వినియోగం ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇది 16.25 మిలియన్ టన్నులకు పెరిగింది. 2016 ఆగస్టులో ఇంధనం డిమాండ్ 18.2 శాతం పెరగ్గా, అప్పటి నుంచి ఇంధనం వాడకంలో ఇదే గరిష్ఠ స్థాయిగా అధికార వర్గాలు వెల్లడించాయి. 2017 ఆగస్టు నెలలో డిమాండ్ 6.1 శాతానికి పడిపోయింది. ఐఇఎ(ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ) అంచనా ప్రకారం.. వచ్చే సంవత్సరాల్లో భారత్ అత్యంత వేగవంతమైన వృద్ధి వినియోగదారుగా ఉండనుంది. ఈ ఏడాది ఎనిమిది నెలల్లో నాలుగు నెలలు ఆయిల్ డిమాండ్ పడిపోయింది. సెప్టెంబర్‌లో డీజిల్ సేల్స్ 6.08 మిలియన్ టన్నులతో 16.5 శాతానికి పెరిగింది. అదే సమయంలో పెట్రోల్ వినియోగం  2.14 మిలియన్ టన్నులతో 17.85 శాతం పెరిగింది.