Thursday, April 18, 2024

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు..

- Advertisement -
- Advertisement -

fuel prices hiked Again in India

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. లీటర్ డీజిల్‌పై 35 పైసలు, పెట్రోల్‌పై 30 పైసలు పెరిగినట్లు ప్రభుత్వ రంగంలోని చమురు కంపెనీలు ఆదివారం ప్రకటించాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.93.52కు చేరుకోగా, పెట్రోల్ ధర రూ. 104.79కు పెరిగింది. ఇక, ముంబైలో పెట్రోల్‌పై 34 పైసలు పెరగడంతో రూ.110.75కు, డీజిల్‌పై 37 పైసలు పెరగడంతో రూ.101.40కు చేరింది. కోల్‌కతాలో పెట్రోల్‌పై 34 పైసలు పెరగడంతో రూ.105.43కు, డీజిల్‌పై 35 పైసలు పెరగడంతో రూ.96.63కు చేరింది. చెన్నైలో పెట్రోల్‌పై 21 పైసలు పెరగడంతో రూ.102.10కు, డీజిల్‌పై 24 పైసలు పెరగడంతో రూ.97.93కు చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్‌పై 36 పైసలు పెరగడంతో రూ.102.10కు, డీజిల్‌పై 39 పైసలు పెరగడంతో రూ.102.04కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడమే తాజా పెంపునకు కారణమని చమురు కంపెనీలు తెలిపాయి.

fuel prices hiked Again in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News