Saturday, April 20, 2024

షాపూర్జీ వాటాల తనఖాపై కోర్టుకు టాటా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : టాటా సన్స్‌లో వాటాల సెక్యూరిటీపై నిధుల సేకరణ నుంచి షాపూర్జీ పల్లోంజి గ్రూప్ (ఎస్‌పి గ్రూప్)ను ఆపాలంటూ టాటా గ్రూప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రూ.3,750 కోట్ల ను సమీకరించేందుకు ఎస్‌పి గ్రూప్ డీల్ కుదుర్చుకున్న తర్వాత మరుసటి రోజు సెప్టెంబర్ 5న టాటా సన్స్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. టాటా గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ తొలగింపుపై టాటా సన్స్, షాపూర్జీ పలంజీ గ్రూప్‌లు ఇప్పటికే ముఖాముఖి తలపడ్డాయి. ఇప్పుడు మరోసారి షాపూర్జీ గ్రూప్ తరపున టాటా సన్స్ షేర్లను తాకట్టు పెట్టడం పట్ల టాటా సన్స్ అభ్యం తం వ్యక్తం చేస్తోంది. షాపూర్జీ గ్రూప్ చర్యను అడ్డుకోవాలని టాటా సన్స్ సుప్రీంను ఆశ్రయించింది. రియల్ ఎస్టేట్, నిర్మాణ వ్యాపారంలో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ప్రస్తుతం నగదు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో టాటా సన్స్‌లో 2 శాతం షేర్లను తాకట్టు పెట్టడం ద్వారా రూ .11,000 కోట్లు సేకరించాలని గ్రూప్ యోచిస్తోం ది. మొదటి విడతలో రూ.3,750 కోట్లు సేకరించడానికి షాపూర్జీ గ్రూప్ ఆస్తి నిర్వహణ సంస్థ బ్రూక్‌ఫీల్డ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News