Home జోగులాంబ గద్వాల్ జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయింపులు

జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయింపులు

Fund

గద్వాల: జనాభా ప్రాతిపధికన నిధులు కేటాయించి వెనకబడిన తరగతులను అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీఠ వెయ్యాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి డిమాండు చేశారు. సామజికంగా వెనకబడిన ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ, బీసీ, మైనార్టీ వర్గాలు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న నిర్లక్ష వైఖరీ కారణంగా నేటికి అన్ని రంగాల్లో వెనకబడి పోయ్యారని వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.

సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మహాజన పాదయాత్ర 2వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం గద్వాలలో సదస్సు నిర్వహించారు. ఈసం దర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ గతేడాది అక్టోబర్ 17వ తేదీన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రారం భమైన పాదయాత్ర డిసెంబర్ 31తేదీ నాటికి 16జిల్లాల్లో రెండు వేల కిలోమీటర్లను పూర్తి చేసుకున్నట్లు పేర్కోన్నారు.

జనాభాలో కేవలం ఏడు శాతం ఉన్న అగ్రకులాలే అన్ని రకాల అత్యున్నత పదవులు, ఉద్యోగలను అనుభవిస్తున్నట్లు మెజార్టీ 93శాతం ఉన్న కులాలు వాటికి దూరంగా ఉంటున్నారని చెప్పారు. జనాభ పాత్రపదికన నిధుల కెటాయింపులు చేస్తేనే ఈవర్గాల అభివృద్ధి సాద్య పడుతుందన్నారు. ఈసదస్సులో వి.వి.నర్సింహా, ఉప్పేరు నర్సింహా, రంగస్వామి, ఇంద్ర, బాలకృష్ణ, రఘు, ఆశన్న, వెంకటేష్, తిరుపతి, శివ తదితరులు పాల్గొన్నారు.