Home Default జామా మసీదు మరమ్మత్తు కోసం నిధులు కేటాయించిన ఎంపి నామా

జామా మసీదు మరమ్మత్తు కోసం నిధులు కేటాయించిన ఎంపి నామా

Funds released for Jama masjid

మన తెలంగాణ/ఖమ్మం: కారేపల్లి మండల కేంద్రం సింగరేణి పంచాయతీలో జామా మసీదు మరమ్మత్తుల కోసం వైరా మాజీ ఎంఎల్‌ఎ బానోతు మదన్‌లాల్ సహకారంతో ఖమ్మం ఎంపి నామా నాగేశ్వరరావు రూ. 4లక్షల నిధులను కేటాయించారు. ఈ సందర్భంగా జామా మసీద్ అద్యక్షులు ఎస్‌కె గౌసుద్దీన్ మాట్లాడారు. నిధులు కేటాయించటం పట్ల ఎంపికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. వెంటనే మసీదు మరమ్మత్తు పనులు ప్రారంభిస్తామని చెప్పారు.