Thursday, April 25, 2024

నేను ఒక సైనికుడి భార్యను..

- Advertisement -
- Advertisement -

Funeral of late Brigadier Lidder is over

ఆయనకు కన్నీటితో కాక చిరునవ్వుతో వీడ్కోలు పలకాలి
లిద్దర్ సతీమణి గీతిక బాధాతప్త వ్యాఖ్యలు
నాన్నే నా హీరో.. మోటివేటర్: కుమార్తె
ముగిసిన బ్రిగేడియర్ లిద్దర్ అంత్యక్రియలు

న్యూఢిల్లీ: తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటన దేశ సేవలో నిమగ్నమై ఉన్న పలువురు భరత మాత బిడ్డలను దూరం చేసింది. వారిని పోగొట్టుకున్న బాధను ప్రతి భారతీయుడు అనుభవిస్తున్నారు. వారి కుటుంబ సభ్యుల ఆవేదనకైతే అంతేలేదు. ఇప్పుడు బ్రిగేడియర్ ఎల్‌ఎస్ లిద్దర్ కుటుంబం కూడా ఆ ఆవేదనలతోనే కుమిలిపోతోంది. శుక్రవారం అంతిమ సంస్కార సమయంలో లిద్దర్ సతీమణి, కుమార్తె కన్నీటిని చూస్తే చెమర్చని హృదయం ఉండదేమో! ఈ కఠిన సమయంలో కూడా వారు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరి హృదయాలను ద్రవింపజేస్తున్నాయి. వారి ధైర్యానికి సలాం కొడుతున్నాయి. విధులు నిర్వర్తిస్తూ శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయిన లిద్దర్ శవపేటికను చుంబించి ఆయన సతీమణి గీతిక వీడ్కోలు పలికారు. తల్లి పక్కనే ఉన్న కుమార్తె ఆష్నా కూడా తన తండ్రి ఇక రారనే ఆవేదనతో కన్నీటిపర్యంతం అయ్యారు.

‘ మేం ఆయనకు గొప్పగా వీడ్కోలు పలకాలి. కన్నీటితో కాకుండా నవ్వుతూ, ప్రశాంతంగా సాగనంపాలి. నేనొక సైనికుడి భార్యను. ఇది పూడ్చలేని నష్టం’ అంటూ లిద్దర్ సతీమణి గీతిక స్పందించారు. ‘ఆత్మగౌరవంకన్నా ఎక్కువ బాధ ఉంది. ఇప్పుడు జీవితం ఇంకా ఎంతో ఉంది. అయితే దేవుడి ఇచ్ఛ ఇదే అయితే ఈ లోగుతోనే మేము జీవిస్తాం. అయితే ఆయన ఇలా తిరిగి రావాలని మేము కలలో కూడా కోరుకోలేదు’ అని ఆమె అన్నారు. కుమార్తె ఆష్నా అయితే వయసుకు మించి దృఢచిత్తాన్ని ప్రదర్శించింది. ‘ఇప్పుడు నాకు 17 సంవత్సరాలు. అంటే నాకు, మా నాన్నకు మధ్య 17 ఏళ్ల అనుబంధం ఉంది. ఆయన దూరమవడం.. దేశానికి పూడ్చలేని నష్టం. బహుశా ఇదే విధి అనుకుంటా. నా తండ్రే నాకు హీరో, నా బెస్ట్ ఫ్రెండ్, నా మోటివేటర్’ అంటూ ఎంతో ధైర్యంగా మాట్లాడింది.

అంతకు ముందు బ్రార్‌స్కేర్ వద్ద లిద్దర్ భౌతిక కాయానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, త్రివిధ దళాధిపతులు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ రవికుమార్, ఎయిర్ చీఫ్‌మార్షల్ ఎఆర్ చౌధరి, ఇతర రక్షణ శాఖ ఉన్నతాధికారులుఅంజలి ఘటించారు. అనంతరం సైనిక లాంఛనాల నడుమ లిద్దర్‌కు తుది వీడ్కోలు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News