Home ఖమ్మం అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు

అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు

Funerals for orphaned bodies

ఖమ్మం అర్బన్: అన్నం సేవా సంస్థ ఆధ్వర్యంలో అనాథ మృతదేహాలకు సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డు లో చికిత్స పొందుతున్న 60 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని ఇద్దరు అనాథ వృద్దులు చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరితో పాటు గాంధీచౌక్ ప్రాంతంలో మరో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందగా పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది సమాచారం మేరకు అన్నం సేవా ఫౌండేషన్ వారు అనాథ శవాలను మార్చురీ నుండి స్వాధీనం చేసుకుని అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కానిస్టేబుల్ గుత్తా ప్రసాద్ సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అన్నం సేవా సభ్యులు రాంబాబు, వెంకటాచారి, రాము, ఓంప్రకాష్, ముస్తాఫా, కూరాకుల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.