Tuesday, April 23, 2024

భవిష్యత్ భారత యువ మార్గదర్శి

- Advertisement -
- Advertisement -

Future Indian Guide Minister KTR

 

ఆయనొక చైతన్య దీప్తి, ఉవ్వెత్తున ఎగిసే యువ తరంగం, ఆయన ఎక్కడుంటే అక్కడ ఉత్సాహం ఉరకలేస్తుంది. ఆశ అణగారిన మనసు ల్లో సైతం విజయా న్ని ముద్దాడగలమనే నమ్మకం జనిస్తుంది. ఆయన సంకల్పించే ప్రతిదీ పక్కా ప్రణాళికతో గమ్యాన్ని అందుకునే తీరతాయి. ఆయన మరెవరో కాదు, నాలున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి, భవిష్యత్ భారతానికి యువ మార్గదర్శి కల్వకుంట్ల తారక రామారావు. ఇవ్వాళ బ్రాండ్ తెలంగాణ అంటే కెటిఆర్ అని ప్రపంచం గుర్తించడమే కాదు ఆయన వెంటే పరుగులు తీస్తుంది. బ్రాండ్ ఇండియా ప్రమోషన్ సైతం మీరే చేయండి అని సాక్షాత్ కేంద్ర మంత్రులే అడుగుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు కెటిఆర్ అంటే ఏంటో. నిరాశతో కోరికని అణచుకున్న తెలంగాణ సమాజం ఉద్యమమై ముందుకు సాగేలా చేసింది. నాడు తండ్రితో కలిసి చేసిన వ్యూహరచన ఫలించడంతో పార్టీని, తెలంగాణని పూర్తిగా ఆకలింపు చేసుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడంతో పాటు యేఏ ప్రాంతాల్లో ఎలాంటి వనరులున్నాయి. ఎలా దోపిడీ కొనసాగుతుంది, ఎలాంటి పరిస్థితులున్నాయో సంపూర్ణంగా తెలుసుకోగలిగారు. గ్రామ స్థాయి నుండి పార్టీ క్యాడర్‌ని బలోపేతం చేసి టిఆర్‌ఎస్‌ను తిరుగులేని శక్తిగా తయారు చేశారు.

వైఎస్ మొదలు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు తెలంగాణకి చేస్తున్న అన్యాయాలని ప్రజా వేదికల మీదే కాకుండా ప్రసార మాధ్యమాల్లోనూ ఆధారాలతో సహా ఎండగట్టిన తీరుని ఇప్పటికీ కెటిఆర్ ఉన్న డిబేట్లో పాల్గొనాలంటే ఎంతలా భయపడేవారో నాటి నేతలు చెప్పుకుంటారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో జరిగిన ప్రతీ స్థానిక ఎన్నికల్లో పార్టీ పట్టుని పెంచుకుంటూ తెలంగాణ అంటే టిఆర్‌ఎస్, టిఆర్‌ఎస్ అంటే తెలంగాణ అనేంతగా పార్టీని తీర్చిదిద్దారు. ఆ అకుంఠిత దీక్షని గుర్తించిన పార్టీ 2008లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని చేసింది. అనంతరం తొలిసారిగా 2009లో ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిపింది పార్టీ. నాడు తొలిసారి అందుకున్న విజయాన్ని నేటివరకూ కొనసాగిస్తూ ఎక్కడా వెనుదిరిగి చూడలేదు. కెటిఆర్ ఉరిశాలగా ఉన్న సిరిసిల్లని సిరిశాలగా మార్చేశారు. ప్రతిపక్షంలో ఉండి సైతం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించిన ఘనత కెటిఆర్‌కె దక్కుతుంది. తదనంతరం ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2010లో కేవలం పది నెలల కాలంలోనే దాదాపు అరవై ఎనిమిది వేలపై చిలుకు మెజారిటీని సాధించారు.

అతి తక్కువ సమయంలోనే సిరిసిల్ల ప్రజల హృదయాల్లో ఎలాంటి ముద్ర వేశారో అర్థం చేసుకోవచ్చు. ఆ అభిమానమే ఇవాల సిరిసిల్ల జిల్లా కేంద్రంగా విరాజిల్లుతూ అనేక పరిశ్రమలతో అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేసింది. పనుల్లేక అల్లాడిపోయిన నేతన్నలు చేతినిండా పనితో తెలంగాణ ఆడబిడ్డలకి చీరెసారెని అందిస్తూ ప్రభుత్వమిచ్చే బీమా భరోసాలతో చిరునవ్వులు చిందిస్తున్నారు. అయితే నేటి ఆ నవ్వుల వెనక నాటి త్యాగాలెన్నో ఉన్నాయి. ప్రపంచ చరిత్రలోనే కనీవినీ ఎరుగని నిరాహార దీక్షని కెసిఆర్ చేస్తుంటే పార్టీ సహచరుడుగానే కాకుండా కుటుంబ సభ్యుడిగా నాడు కెటిఆర్ నిర్వహించిన పాత్ర, చూపించిన తెగువ అనన్య సామాన్యం. తండ్రి ముత్యువు ముంగిట్లోకి వెళ్తున్నా ఆ బాధని పంటిబిగువున భరించి తెలంగాణ కోసం పరితపించిన ఆ హృదయానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. ఆ అసమాన త్యాగానికి ఫలితంగా వచ్చిన డిసెంబర్ 9 ప్రకటనకి అంతే సంబురంగా బాధని మర్చిపోయిన అసామాన్యుడు కెటిఆర్. 2011, సెప్టెంబర్ 13న ప్రారంభమైన చారిత్రక సకల జనుల సమ్మెకి టిఆర్‌ఎస్ తరుపున దొరికిన మద్దతు అనన్యసామాన్యమైనది.

ఆ సమయంలో ఉద్యోగుల్లో నైతిక స్థైర్యం నింపడంలో ముందు వరుసలో నిలుస్తాడు కెటిఆర్. నాడు చేసిన రైలు రోకో, జైల్ బరో, రాస్తారోకో, వంటా వార్పు తదితర ఉద్యమ పంథాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా నమోదైన అనేక కేసుల్లో కొన్ని నేటికీ కొనసాగుతున్నాయంటేనే నాడు కేసులకి వెరవని, ప్రలోభాలకి లొంగని ఆ వ్యక్తిత్వం మనకు అర్థమవుతుంది.మిలియన్ మార్చ్ లాంటి మెగా ఈవెంట్ అత్యంత క్రమశిక్షణతో సుశిక్షుతులైన సాయుధులుగా నాడు టిఆర్‌ఎస్ శ్రేణులు, రాష్ట్ర ప్రజలు పాల్గొన్నారంటేనే ఉద్యమ ఆకాంక్షలు వాళ్లలో ఎంత బలంగా నాటుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలా అనేక ఉద్యమాల ద్వారా సాకారమైన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కెటిఆర్ ప్రస్థానం సువర్ణాక్షరాలతో లిఖించదగింది.

కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఎదుర్కొనే అనేక ప్రాథమిక అడ్డంకులని సమర్థవంతంగా తొలగించి, కొత్తకొత్త పరిశ్రమలు తెలంగాణలో ఏర్పాటు చేయడానికి యావత్ దేశానికే మార్గదర్శనం చేసేలా ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చి, సింగిల్ విండో అనుమతులు జారీచేసిన ఏకైక ప్రభుత్వంగా తెలంగాణని నిలిపాడు కెటిఆర్. ఇలా తనకున్న సాంకేతిక పరిజ్ణానాన్ని వాడుకుంటూ ఐటికి సిలికాన్ వ్యాలీని మించి ప్రపంచ రాజధానిగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాడు. అమెజాన్, గూగుల్, ఆఫిల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ ప్రసిద్ధి కంపెనీలు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నాయంటే ఆయన కృషే ప్రధాన కారణం. బ్రతుకు భారమై వలసపాలనలో గతి తప్పిన తెలంగాణను వదిలి సముద్రాలు దాటి వలస వెళ్లిన తెలంగాణ బిడ్డల కోసం సమగ్రమైన ఎన్‌ఆర్‌ఐ పాలసీ రూపొందించి వారు సగర్వంగా జీవించేలా చేశారు. గనులు, మైనుల కేటాయింపుల్లో సాంకేతికతని ప్రవేశపెట్టి పారదర్శకత తీసుకొచ్చిన పాలనాదక్షుడు రామన్న.

టి-హబ్, వి-హబ్, టి-పైబర్ వంటి విప్లవాత్మక సంస్థలను ఏర్పాటు చేసి ఎంతో మందిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతున్నాడు. హైదరాబాద్ మహానగర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో నూటాయాభై స్థానాలకి తొంభై తొమ్మిది స్థానాల్ని ఒంటిచేత్తో గెలిపించి హైదరాబాద్‌పై పార్టీ పట్టులేదని అన్న విమర్శకుల నోళ్లు మూయించాడు. ఇంతటి అసమాన్య విజయాన్ని మెచ్చి సాక్షాత్తు ముఖ్యమంత్రే స్పందించి మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల్ని రామన్నకి అప్పగించారంటే తన పనితీరుతోనే పదవులు సాధించుకునే అత్యంత అరుదైన నేత రామన్న. దావోస్‌లో జరిగిన ప్రపంచ వాణిజ్య సమావేశాలకి కేంద్ర ప్రభుత్వం నుండి కాక ఒక రాష్ట్ర ప్రతినిధిగా హాజరైన ఒకే ఒక్క రాష్ట్ర మంత్రి కెటిఆర్. ఆ వేదికపై కేంద్ర ఐటిశాఖ మంత్రిగా పలు దేశాధి నేతలు కెటిఆర్‌ని అభివర్ణించారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన ప్రతిభని. బ్రాండ్ తెలంగాణే కాదు బ్రాండ్ ఇండియాని సైతం మీరే ప్రమోట్ చేయండి అని కేంద్రమంత్రులే కెటిఆర్‌ని కోరుతున్న తీరు అభివృద్ధిలో అంతా భారతీయం అనే ఆయన మనస్తత్వాని నిదర్శనం.

సిరిసిల్ల నుండి సిలికాన్ వ్యాలీ వరకూ రామన్న ప్రస్థానం తెలంగాణకి ఓ సువర్ణాధ్యాయం. గుడ్ అడ్మినిస్ట్రేటర్‌గా ప్రతిష్ఠాత్మక స్కోచ్ సంస్థ స్టార్టప్ ఇండియా కేటగిరిలో ఛాలేంజర్ అవార్డుని, ఐటి మినిస్టర్ ఆఫ్ ద ఇయర్ వంటి అవార్డులని అందించింది. ఆడి రిట్జ్ సంస్థ ఇన్ఫర్మేషనల్ ఐకాన్ ఆప్ ద ఇయర్ అవార్డుని కట్టబెట్టింది. లీడర్ ఆఫ్ ద ఇయర్, బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ వంటి అవార్డులని, 2017 గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమావేశా ల్లో గెలుచుకున్నారు. ఇంకా ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థల నుండి మరెన్నో అవార్డులని దేశంలో కేవలం రామన్న మాత్రమే సొంతం చేసుకోగలిగారు. ఇలా అనునిత్యం తెలంగాణే ఆశగా, శ్వాసగా బ్రతుకుతున్న కెటిఆర్ కృషి మూలంగానే 2020లో మనం చూస్తున్న ప్రపంచ అతిపెద్ద సంక్షోభాన్ని సైతం తట్టుకొని తెలంగాణ పెట్టుబడులని ఆకర్షిస్తూనే ఉంది. ఒక నిబద్ధత కలిగిన తెరాస సైనికునిగా, ఒక సగటు తెలంగాణ పౌరుడిగా కెటిఆర్ తరంలో నేనుండడం నా అదృష్టం. అంతటి మంచి మనిషితో పని చేయగలగడం నా పూర్వజన్మ సుకృతం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News