Friday, March 29, 2024

జి 20 సదస్సు… భద్రతా సిబ్బంది నిఘాలో శ్రీనగర్

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : సోమవారం నుంచి శ్రీనగర్ లో ప్రారంభం కానున్న జి 20 సదస్సుకు తగిన భద్రత కల్పించడానికి భద్రతా సిబ్బంది , అధికార యంత్రాంగం అనుక్షణం అప్రమత్తతలో ఉంటోంది. నేషనల్ సెక్యూరిటీ గార్డు (ఎన్‌ఎస్‌జి ) కౌంటర్ డ్రోన్ యూనిట్ బృందాలు గగనతలమంతా పర్యవేక్షిస్తున్నాయి. నేవీ పెట్రోల్ మెరైన్ కమాండోస్ శ్రీనగర్ లోని డాల్ సరస్సును జల్లెడపడుతున్నాయి. ఇతర భద్రతా సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నాయి.

ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 60 మంది ప్రతినిధులు, 20 మంది పాత్రికేయులు, ఈ జి 20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సదస్సులో పాల్గొననున్నారు. ఆర్టికల్ 320 రద్దు అయిన తరువాత, జమ్ముకశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిన తరువాత కశ్మీర్‌లో అంతర్జాతీయ స్థాయిలో మొదటిసారి జరుగుతున్న సదస్సు ఇదే కావడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News