Friday, March 29, 2024

మే 30న కృత్రిమ మేధస్సుపై జి7 అధికారుల తొలి సమావేశం

- Advertisement -
- Advertisement -
మైక్రోసాఫ్ట్ మద్దతుగల ఓపెన్ ఏఐ ద్వారా చాట్ జిపిటి వంటి ప్రసిద్ధ కృత్రిమ మేధస్సు సేవల ప్రభావాన్ని ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక నియంత్రకాలు అంచనా వేస్తున్నందున ఈ సమావేశం జరుగనున్నది.

టోక్యో: గ్రూప్ ఆఫ్ సెవెన్(జి7) దేశ అధికారులు వచ్చే వారం సమావేశమై చాట్ జిపిటి వంటి జరరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టూల్స్ ద్వారా ఎదురయ్యే సమస్యలను పరిగణనలోకి తీసుకుంటారని జపాన్ శుక్రవారం తెలిపింది. అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్ ఉన్న జి7 నాయకులు గత వారం వేగంగా అభివృద్ధి చెందుతున్న కృతిమ మేధస్సు సాధానాల చుట్టూ ఉన్న సమస్యలను చర్చించడానికి ‘హిరోషిమా ఏఐ ప్రక్రియ’ అని పిలువబడే ఒక అంతర్ ప్రభుత్వ ఫోరమ్‌ను ఏర్పాటు చేయడానికి అంగీకరించాయి.

జి7 ప్రభుత్వ అధికారులు మే 30న మొదటి వర్కింగ్ లెవల్ ఏఐ సమావేశాన్ని నిర్వహిస్తారు, మేధో సంపత్తి రక్షణ, తప్పుడు సమాచారం, సాంకేతికతను ఎలా గవర్న్ చేయాలి వంటి అంశాలు పరిశీలిస్తారని జపాన్ కమ్యూనికేషన్స్ మంత్రి టేకికి మాట్సు మోటో తెలిపారు.

మైక్రోసాఫ్ట్ మద్దతుగల ఓపెన్ ఏఐ ద్వారా చాట్ జిపిటి వంటి ప్రసిద్ధ ఏఐ ప్రభావాన్ని ప్రపంచవ్యాప్త సాంకేతిక నియంత్రకాలు అంచనా వేస్తున్నందున ఈ సమావేశం జరుగబోతున్నది. ఈ సంవత్సరం జి7 అధ్యక్షత వహిస్తున్న జపాన్ ‘ఉత్పాదక ఏఐ సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించే విషయంపై జి7 చర్చకు నాయకత్వం వహిస్తుది’ అని మాట్సు మోటో అన్నారు. సంవత్సరాంతానికి దేశాధినేతలు సూచనలతో ముందుకు వస్తారని ఫోరమ్ భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News