Friday, April 19, 2024

ఎంతమందికైనా చికిత్సకు రెడీ

- Advertisement -
- Advertisement -

ktr etela rajender

 

15 రోజుల్లో 1500 బెడ్లతో అందుబాటులోకి గచ్చిబౌలి కరోనా ఆసుపత్రి, పూర్తి కరోనా చికిత్సకే 8 ప్రత్యేక దవాఖానాలు, కొవిడ్ ఆసుపత్రులుగా 22 మెడికల్ కాలేజీలు : గచ్చిబౌలిలో క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలిస్తూ మంత్రులు ఈటల, కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైద్యం కోసం 1500 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తెస్తున్నామని వై ద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్ని పాజిటివ్ కేసులు వచ్చినా, చికిత్స అందించేందుకు మెరుగైన వసతులతో అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన అన్నారు. మంగళవారం టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్‌తో కలసి ఆయన గచ్చిబౌలిలోని క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కట్టడిలోనే ఉందని, ఈ వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. సిఎం సూచనల మేరకు ప్రస్తుతం 8 ఆసుపత్రులను పూర్తిస్థాయిలో కొవిడ్ ఆసుపత్రులుగా మార్చాలని నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే గాంధీ ఆసుపత్రి పూర్తిగా కొవిడ్ ఆసుపత్రిగా మారిందని, దీంతో పాటు గచ్చిబౌలిలో ఉన్న క్వారంటైన్ కేంద్రాన్ని పూర్తిగా కరోనా ఆసుపత్రిగా మారుస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

సిఎం ఆదేశాలతో చైనా తరహాలో ఆసుపత్రిని నిర్మించామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరిగితే వైద్యం ఆలస్యం కాకుండా చికిత్సను అందించేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఈ ఆసుపత్రిని అందుబాటులోకి తెస్తున్నామన్నారు. రాష్ట్రంలో కరోనా చికిత్స కోసం 8 ప్రత్యేక ఆసుపత్రులను అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి ఈటల స్పష్టం చేశారు. గాంధీ, కింగ్‌కోఠి, గచ్చిబౌలి స్పోర్ట్ సెంటర్ ,ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి, ఫీవర్, సరోజిని దేవి కంటి హాస్పిటల్, నాచారం ఇఎస్‌ఐ, వరంగల్ ఎంజిఎం ఆసుపత్రులను కరోనా ప్రత్యేక ఆసుపత్రులుగా మార్చుతున్నామని ప్రకటించారు. వీటిలో అనుమానిత లక్షణాల వారికి ఐసొలేషన్, రోగులకు చికిత్సను అందిస్తామన్నారు. గాంధీ, కింగ్‌కోఠి ఇప్పటికే పూర్తిస్థాయిలో కొవిడ్ ఆసుపత్రులుగా మారగా, తాజాగా గచ్చిబౌలి క్వారంటైన్ సెంటర్ కూడా కొవిడ్ ఆసుపత్రి మారిందన్నారు. ఈ హాస్పిటల్స్‌లో 5వేల బెడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

22 ప్రైవేట్ మెడికల్ కాలేజీలనూ..
రాష్ట్రంలో 22 ప్రైవేట్ మెడికల్ కాలేజీలనూ కొవిడ్ ఆసుపత్రులుగా మార్చుతున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. మొయినాబాద్‌లో భాస్కరా కాలేజీలోని కరోనా చికిత్స ఏర్పాట్లను మంగళవారం ఆయన వైద్యశాఖ మంత్రి ఈటలతో కలసి పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ..రోజురోజుకు విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన కొవిడ్ ఆసుపత్రిని 15 రోజుల్లో అందుబాటులోకి రావాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ 22 మెడికల్ కాలేజీల్లో 10 వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయని, వీటిలో 80 శాతం బెడ్లు కరోనా కోసమే కేటాయిస్తామని మంత్రి కెటిఆర్ అన్నారు. అక్కడ వైద్యం అందించేందుకు ఆయా సంస్థలకు చెందిన డాక్టర్లు, నర్సులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని, మందులు, సానిటైజర్లు, పర్సనల్ ప్రోటెక్షన్ ఎక్విప్‌మెంట్స్ ఇతరత్ర వస్తువులు ప్రభుత్వం అందిస్తుందని కెటిఆర్ పేర్కొన్నారు.

 

Gachibowli Corona Hospital available
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News