Home తాజా వార్తలు ఎన్‌కౌంటర్‌లో 8మంది నక్సల్స్ మృతి

ఎన్‌కౌంటర్‌లో 8మంది నక్సల్స్ మృతి

Eight Maoists Members Died in Encounter

తెలంగాణ, ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో మరోసారి ఎదురుకాల్పులు…
వరుస ఎన్‌కౌంటర్లతో దద్దరిల్లుతున్న అటవీ ప్రాంతం
ఏజెన్సీలో భయం..భయం..

మన తెలంగాణ/వాజేడు : తెలంగాణ, ఛత్తీస్‌గడ్ సరిహద్దు అటవీప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగిన సంఘటనలో 8 మంది మావోయిస్టులు మృతి మృతిచెందారు. ఇటీవల మహారాష్ట్ర గడ్చిరోలి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగలగా ఇప్పుడు ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని అన్నారం, మర్రిమళ్ళ,లోదేడు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో గ్రేహౌం డ్స్ దళాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతూ కూం బింగ్ నిర్వహిస్తూండగా  శుక్రవారం తెల్లవారుజామున పోలీసులకు,మావోయిస్టులు ఎదురుపడటంతో మావోయిస్టులపై పోలీసులు  కాల్పులు జరిపారు. ఎదురు కాల్పులతో అటవీ ప్రాంతం తుపాకీ మోతలతో దద్దరిల్లింది. పోలీసులకి మావోయిస్టులకి జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు  పురుషులు మృతి చెందారు. మృతుల్లో భద్రకాళి కమాండర్ ఉన్నట్లు సమాచారం దీంతో ఏజెన్సీ ప్రాంతాలలో  భయానక వాతవరణం నెలకొంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలం ఛత్తీస్‌గడ్ సరిహద్దు అడవుల్లో శుక్రవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల నుంచి ఒక ఎల్‌ఎస్‌ఆర్ పిస్టల్, 303 రైఫిల్ , రివాల్వర్1,ఎస్‌బిబిఎల్-4,రాకెట్ లాంచర్-6,హెచ్‌ఈ గైండర్స్-3, కిట్ బ్యాగ్స్- 10లను స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన మావోయిస్టుల మృతదేహలను బీజాపూర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.ఎదురు కాల్పుల్లో పాల్గొన్న పోలీసు బలగాలు వెనుదిరిగి వస్తున్న తరుణంలో మావోయిస్టులు రెండుప్రదేశాలలో మందుపాతరలు పేల్చారు. ఈ సంఘటనలో ముగ్గురు పోలీసులకు తీవ్రంగా గాయాలైనట్లుసమాచారం. వరుస ఎన్‌కౌంటర్ల తో తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతం దద్దరిల్లిపోతుంది.