Friday, March 29, 2024

రేపటి నుంచి గడ్డిఅన్నారం మార్కెట్ బంద్

- Advertisement -
- Advertisement -

Gaddiannaram Market

 

మన తెలంగాణ, హైదరాబాద్ : గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కు ఈ బుధవారం నుంచి తాత్కాలిక సెలవు మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రకటించారు. మార్కెట్‌లో సోషల్ డిస్టెన్స్ పాటించాలన్న నిబంధనలకు విఘాతం కలగడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నిబంధనలు ఉల్లంఘించిన 44 మంది కమిషన్ ఏజెంట్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కోహెడ మార్కెట్ బంద్ కావడంతో గడ్డిన్నారం మార్కెట్‌లో వ్యాపారులు రద్దీ పెరిగింది. రద్దీ దృష్టా తాత్కాలిక సెలవు ప్రకటించింది వ్యసాయ మార్కెట్ కమిటీ. దీంతో నేటి నుంచి మామిడి కాయల అమ్మకాలు నిలిచిపోనున్నాయి. రైతులు తెలియక తీసుకు వస్తే సరూర్‌నగర్ వీఎం హోమ్స్ మైదానంలోని తాత్కాలిక మార్కెట్‌లో కొనుగోళ్ళు జరుపుతామన్నారు.

గడ్దిన్నారం మార్కెట్ తిరిగి ఎప్పుడు ప్రారంభించేది ఎప్పుడనేది ఉన్నతాధికారులు నిర్ణయమని ఏఎంసి కార్యదర్శి వెంకటేశం తెలిపారు. రైతులు, కమిషన్ ఏజెంట్లు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రైతులు తొందరపడి సరుకును మార్కెట్‌కు తీసుకు రావద్దని విజ్ఞప్తి చేశారు. పెద్దఎత్తున వీచిన ఈదురుగాలలకు కోహెడ మార్కెట్ ఈ నెల 4వ తేదీన కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కరోనా నేపథ్యంలో గడ్డిఅన్నారం మార్కెట్‌ను తాత్కాలికంగా కోహెడకు తరలించిన విషయం తెలిసిందే. కోహెడ వద్ద పండ్ల మార్కెట్ పునరుద్దరణకు పనులను అధికారులు చేపట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News