Wednesday, May 29, 2024

ఏటా 5 లక్షల ప్రమాదాల్లో 1.5 లక్షల మంది మృతి…

- Advertisement -
- Advertisement -
Nitin-Gadkari
ప్రమాదాల నివారణలో వైఫల్యంపై కేంద్రమంత్రి గడ్కరీ ఆవేదన

నాగపూర్ : దేశంలో ఏటా ఐదు లక్షల ప్రమాదాలు సంభవించి దాదాపు 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని 2.5 నుంచి 3 లక్షల మంది వరకు గాయపడుతున్నారని కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ వెల్లడించారు. ప్రాణాలు కోల్పోతున్న వారిలో 62 శాతం మంది 1835 ఏళ్ల లోపు వారేనని చెప్పారు. తమ మంత్రిత్వ శాఖ అనేక చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలను తగ్గించ లేక పోతోందని ఆయన ఆందోళన వెలిబుచ్చారు.

రోడ్డు ప్రమాదాలు 29 శాతం వరకు తగ్గించి , 30 శాతం వరకు ప్రాణనష్టం తగ్గించిందని తమిళనాడును మంత్రి ప్రశంసించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా నాగపూర్‌లో జరిగిన సభలో మాట్లాడారు. శనివారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈ నెల 17 వరకు జరుగుతాయి. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంపొందించ డానికి పోలీస్, ఆర్‌టిఒ, ఎన్‌జివొలు సమష్టి కృషి సాగించాలని సూచించారు. అప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు.

Gadkari said 15 lakh deaths in 5 lakh accidents every year

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News