Home జోగులాంబ గద్వాల్ ఎసిబికి చిక్కిన డిఎంహెచ్ఒ

ఎసిబికి చిక్కిన డిఎంహెచ్ఒ

Gadwal DMHO Caught By ACB Officersజోగులాంబ గద్వాల : లంచం తీసుకుంటూ ఓ డిఎంహెచ్ఒ ఎసిబి అధికారులకు చిక్కారు. వడ్డేపల్లి మండలంలో మెడికల్ ఆఫీసర్ గా పని చేస్తున్న డాక్టర్ మంజులకు కాకతీయ మెడికల్ కాలేజీలో పిజి సీటు వచ్చింది. దీతో పిజిలో జాయినింగ్ కోసం రిలీవింగ్ ఆర్డర్ కావాలని దరఖాస్తు చేసుకుంది. ఆమెకు రిలీవింగ్ ఆర్డర్ ఇచ్చేందుకు గద్వాల డిఎంహెచ్ఒ డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో మంజుల మహబూబ్ నగర్ ఎసిబి అధికారులను ఆశ్రయించింది. గురువారం గద్వాల పట్టణంలో ఉన్న డిఎంహెచ్ ఆఫీసులో మంజుల ఏడు వేల నగదును డిఎంహెచ్ఒకు ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఎసిబి డిఎస్ పి కృష్ణాగౌడ్, సిఐ ప్రవీణ్ కుమార్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.