Home జోగులాంబ గద్వాల్ నత్తనడకన గద్వాల ఆర్‌ఓబి నిర్మాణ పనులు..

నత్తనడకన గద్వాల ఆర్‌ఓబి నిర్మాణ పనులు..

Gadwal-ROB

గద్వాల: అధికారుల , కాంట్రాక్టర్ల నిర్లక్షం, అలసత్వం వల్ల నిత్యం ప్రజలు నకరం అనుభవిస్తు రెండవ రైల్వే గేట్ పడితే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్నది. గద్వాల పట్టణానికి ముఖ్యరహదారి అయిన కర్నూల్, అయిజను కలిపే విధంగా ఆర్‌ఒబిని మొదటి రైల్వే గేట్ వద్ద గత ఐదు సంవత్సరాల క్రితం నిర్మించడం మొదలు పెట్టారు. ఈ నిర్మాణం లో దాదాపు ముగ్గురు కాంట్రాక్టర్లు మారారని చెప్పవచ్చు. ప్రస్తుతం పనిచేసే కాంట్రాక్టర్, ఆర్‌అండ్‌బి అధికారుల నిర్లక్షానికి ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఆర్‌ఒబి నిర్మాణం ఏ సమయంలో మొదలు పెట్టారో కానీ నేటి వరకు పూర్తి కాక పొవడంతో ప్రజలు, వృద్దులు, పిల్లలు అవస్థలు పడాల్సి వస్తున్నది. అసలే వేసవి కాలం కావడంతో కర్నూల్ , హైదరాబాద్ వెళ్లే వాహనదారులు రెండవ రైల్వేగేట్ నుండి వెళ్లాల్సి వస్తుండగా అరగంటకు ఒకసారి రైలు గేట్‌వేయడంతొ గేట్ ముందు పడిగాపులు కాయాల్సి వస్తుందని అసలే వేసవికాలం కావడంతో ఎండకు నిలవలేక పొతున్నట్లు తెలిపారు. అత్యవసర సమయాలలో ఆసుపత్రికి తరలించే అంబులెన్సు వాహనాలు సైతం ఈ గేట్ ముందు నిలవాల్సిందే.
ఐదేళ్లు అయినా పూర్తికాని బ్రిడ్జి… జిల్లా ఏర్పడింది కానీ ఆర్‌ఒబి మాత్రం పూర్తి కాలేదు ఈ బ్రిడ్జి సరసన భారీ ప్రాజెక్టులైన కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి పథకాలు పూర్తి కానున్నా గద్వాలలో నిర్మించే ఆర్‌ఒబి మాత్రం ఏందుకు పూర్తి కావడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు ఇక్కడి ప్రజాప్రతినిధుల అలసత్వమా లేక అధికారుల నిర్లక్షమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకు ఇక్కడ పనిచేసిన జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ సైనీ, ప్రస్తుత కలెక్టర్ శశాంక లు కాంట్రాక్టర్ ను ఆదేశించినా కాంట్రాక్టర్ మొండి వైఖరి వల్ల పనులు నత్తనడకన సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక గద్వాల ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం బ్రిడ్జిని పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఇందుకు సంబందించిన అన్ని శాఖల సమన్వయంతో పని పూర్తి చేయాలని ఆదేశించినా ఎక్కడి గొంగడి అక్కడే మారింది. గత మూడు మాసాలుగా జమ్ములమ్మ భక్తుల అవస్థలు వర్ణనాతీతం. మంగళవారం వచ్చిందంటే చాలు వారి బాధలు వర్ణనాతీతం. ఎండలో నిలుచునలేక , గేట్ ముందు పడిగాపులు కాయాల్సి వస్తుంది .దీంతో కిలొమీటర్ వరకు ట్రాఫిక్ స్థంబించిపొతుంది.
రైల్వేగేట్ వద్ద బారులు తీరిన వాహనాలు… రెండవ రైల్వేగేట్ నుండి రొడ్డు దాటాల్సిన వాహనాలు పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఉదయం 6 గంటలనుండి రాత్రి 10 గంటల వరకు ఇదే తంతు. ప్రతి గంటకొమారు రైలు రావడంతొ గేట్ పడుతుంది దీంతొ గేట్ ముందు కిలొమీటర్ మేర వాహనాలు నిలిచిపొయి వాహన ట్రాఫిక్ ఏర్పడుతుందని వాహనదారులు తెలిపారు. దీంతో పొలీసులు కూడా ట్రాపిక్ ను నియంత్రించలేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. దేశంలో ఐదేళ్లుగా పూర్తి కాని నిర్మాణం ఏదైనా ఉందంటే అది గద్వాల ఆర్‌ఒబి అని చిన్నపిల్లలు సైతం ఠక్కున చెబుతారు. ప్రభుత్వ అధికారులు ఆదేశించినా నేటి వరకు పనులు పూర్తి కాక పొవడం వెనుక కాంట్రాక్టర్ , అధికారులు నిరలక్షమేనని ప్రజలు బాహాటంగా ఆరోపిస్తున్నారు. ప్రజలకు అవసరమయ్యే నిర్మాణాలు చేపట్టాలి కానీ గత ఐదు సంవత్సరాలుగా ప్రజలను బాధ పెట్టే ఏకైక ప్రాజెక్టు గద్వాల ఆర్‌ఒబి అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ నిర్మాణం పై అనేక పార్టీలు దర్నాలు కూడా చేశాయి కానీ ప్రభుత్వంలొ చలనం లేదని చెప్పవచ్చు. ఈనెలాఖరున బిఎల్‌ఎఫ్ పార్టీ కూడా నిరసన తెలపడానికి సిద్దంగా ఉన్నారు. మరి ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడలిమరి.

Gadwal People Troubles with Traffic Due to ROB Development Works