Tuesday, February 7, 2023

కోడిపందాల క్రీడపై గజ్వేల్ పోలీసుల దాడి

  • 8 మంది అరెస్టు, రూ.81 వేల నగదు,5పందెం కోళ్ల స్వాధీనం
- Advertisement -

Cock-Fightగజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మన గూడ గ్రామ శివారులో ఆదివారం కోడిపందాలను గజ్వేల్ పోలీసులు అడ్డుకున్నారు. చట్ట విరుద్దంగా కొందరు గ్రామ శివారులో కోడిపందాలను నిర్వహిస్తున్నారని స్థానిక ఎస్సై కమలాకర్‌కు అందిన సమాచారంతో వెంటనే ఆగ్రామ శివారులోకి పోలీసులు వెళ్లారు. కోడిపందాలు ఆడుతున్న 8 మంది నిందితులను అదుపులో తీసుకున్నారు. పందెంలో పెట్టిన రూ.81వేల నగదును, ఐదు పందెం కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు జరిపిన ఈ దాడినుండి మరికొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు ఎస్సై కమలాకర్ రెలిపారు. రిమ్మనగూడ శివారులో కోళ్లపందాలు నిర్వహిస్తున్నట్లు అందిప సమాచారంతో ఆదివారం గజ్వేల్ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో కొందరు తప్పించుకుని పారిపోగా పట్టుపడ్డ వారిలో దాసరి వీరబాబు, పోలపాపయ్య(గజ్వేల్), మంద దేవేందర్ రెడ్డి(మర్కూక్), పాము శివరాం(మేడ్చల్), పిల్ల సూరిబాబు, కాయితి బాలసుబ్రమణ్యం, మార్త బాలయోగి, దాసరి నాగభూషణం (హైదరాబాద్) లున్నారు. నిందితు లను  గజ్వేల్ పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు. గజ్వేల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధ్దమైన పేకాట, కోడిపందాలు తదితర జూదాలు, మద్యపానం, ఇతరత్రా చట్ట విరుద్ద కార్యకలా పాలకు పాల్పడితేడే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై కమలాకర్ హెచ్చరించారు. గ్రామాల్లో, పట్టణంలో కానీ ఇలాంటి చట్టవిరుద్ద కార్యకలాపాలు దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం చేరవేయాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles