Home తాజా వార్తలు రాజకీయాల్లోకి గంభీర్ ఎంట్రీ?

రాజకీయాల్లోకి గంభీర్ ఎంట్రీ?

Gambhir

ఢిల్లీ: క్రికెటర్లు రాజకీయాల్లో రంగప్రవేశం చేసి హిట్ అవుతున్నారు.  మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్  పాక్ ఎన్నికలలో పోటీ చేసి ఏకంగా  ప్రధాని అయ్యారు. ఈ లెక్కన చూస్తే భారత్ లో అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపిగా గెలిచారు. సిద్దు అయితే  పంజాబ్ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా టీమిండియా ఓపెనర్ గౌతమ్ గంభీర్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలలో బిజెపి తరపున గంభీర్ పోటీ చేస్తున్నట్టు సమాచారం. జాతీయ భావాలు, దేశభక్తి ఎక్కువగా ఉంటే గౌతీకి ఎంపి టిక్కెటు ఇవ్వాలని బిజెపి భావిస్తుంది. వచ్చే ఎన్నికలలో గంభీర్ గెలిస్తే మరో క్రికెటర్ ను రాజకీయ నాయకుడిగా చూడొచ్చు. గౌతమ్ గంభీర్ ఈ మధ్య భారత జట్టులో చోటు కోల్పోయాడు. జాతీయ జట్టులోకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉండటంతో రాజకీయాల్లో రావడమే బెటర్ అని అభిమానులు అనుకుంటున్నారు. గంభీర్ తన కెరీర్ లో మొత్తం 58 టెస్టులాడి 4154 పరుగులు, 147 వన్డేలో  5238 పరుగులు చేశాడు. 1981 సంవత్సరంలో ఢిల్లీలో జన్మించాడు.