Thursday, March 28, 2024

కరోనా రోగులకు కొత్త ఆశలు..

- Advertisement -
- Advertisement -

వేగం పెరిగిన కోవిడ్ చికిత్సలు
గాంధీలో క్లినికల్ ట్రయల్స్ సత్పలితాలు
ప్లాస్మాథెరఫీతో 8 మందికి పుఃనర్జన్మ
అందుబాటులోకి వచ్చిన కొత్త మెడిసిన్స్‌తోనూ పెరుగుతున్న విశ్వాసం

Gandhi hospital corona patient cure

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో కరోనా రోగులకు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కోవిడ్ చికిత్సకు వేగం పెరగడంతో బాధితులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇన్నాళ్లు వైరస్ సోకితే ఏం జరుగుతుందోనని టెన్షన్ పడ్డ వారికి అందుబాటులోకి వస్తున్న కొత్త మందులతో విముక్తి కలుగుతోంది. ముఖ్యంగా కరోనా నోడల్ కేంద్రమైన గాంధీలో కొత్త మందులపై క్లినికల్ ట్రయల్స్ అద్బుతమైన ఫలితాలను ఇస్తున్నాయని వైద్యులు వెల్లడించారు. ఇటీవల ఐసిఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) అనుమతితో కోవిడ్ నోడల్ కేంద్రం గాంధీలో ఆ మందులపై పలు దశలుగా క్లినికల్ ట్రయల్స్ జరుగగా, ఎక్కవ శాతం మంది కోలుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

వీటి పనితీరు కూడా మెరుగ్గా ఉందని గాంధీ వైద్యులు సంతృప్తిని వ్యక్తం చేశారు. దేశంలోని 25 కేంద్రాల్లో ఈ మందులపై ప్రయోగాలు చేయగా, దాదాపు అన్ని కేంద్రాల్లో మంచిఫలితాలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్లాస్మాథెరఫీతో 8 మంది రోగులకు పుఃనర్జన్మ లభించగా, కరోనా మందులుగా మార్కెట్లోకి వచ్చినా రెమిడిస్‌విర్ , దానికి అనుబంధంగా ఉన్న ఇంట్రాఫోర్, రిటోనావీర్, లుథినావీర్ మందులు కూడా మంచి ఫలితాలు ఇచ్చినట్లు వైద్యులు తెలిపారు. రెమిడిస్‌విర్‌ను ఏడుగురుకు ఇవ్వగా, దాని అనుబంధ మందులను నలుగురు వ్యక్తులు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. వారంతా ప్రస్తుతం కోలుకున్నారని సూపరింటెండెంట్ ప్రో డా రాజరావు ప్రకటించారు.

ఈ మందులు అందుబాటులోకి రాకముందు ఎయిడ్స్ నివారణకు వినియోగించిన మందులను వాడి మంచి ఫలితాలు సాధించామని ఆయన తెలిపారు. కానీ ఇప్పుడు ఈ మందులను కూడా వాడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. అయితే కరోనా బాధితుడి ఆరోగ్య పరిస్థితి, శరీర ఉష్ణోగ్రతలను బట్టి ఆ మెడిసిన్స్‌ను ప్రయోగిస్తామని వైద్యులు చెప్పారు. ఇదిలా ఉండగా తక్కువ తీవ్రత కలిగిన, మధ్యస్థ లక్షణాలు ఉన్న కరోనా రోగులకు మొదట్లో వినియోగించిన మందులనే వినియోగిస్తామని, కేవలం వైరస్ తీవ్రత ఎక్కువ ఉన్న వారికి మాత్రమే కొత్తగా అందుబాటులోకి వచ్చిన మందులను ప్రయోగిస్తామని గాంధీ వైద్యుల్లో ఒకరు పేర్కొన్నారు.

ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసం….

గాంధీ వైద్యులు క్లినికల్ ట్రయల్స్ సత్ఫలితాలు ఇస్తుండటంతో కరోనా రోగుల్లో విశ్వాసం పెరిగింది. వైరస్ బారిన పడిన తమకు ఎలాంటి నష్టం చేకూరదనే అభిప్రాయానికి వచ్చేశారు. మరోవైపు ప్రభుత్వం కూడా వేగంగా టెస్టింగ్, ట్రెసింగ్, ట్రీట్మెట్‌లను అందిస్తుండటంతో ప్రజల్లో ఉన్న అపోహాలన్నీ తొలగిపోయాయి. కార్పొరేట్‌కు పోయి పైసలు ఖర్చుపెట్టేకంటే, ప్రభుత్వ హాస్పిటల్స్‌లోనే చికిత్స తీసుకుంటామని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం జిల్లాల్లోనూ ఐసొలేట్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో గాంధీలో రోగుల బారం కాస్త తగ్గింది. దీంతో షెషెంట్ కేర్ బాగుందని కోలుకున్న రోగులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఎవ్వరు నమొద్దని, గాంధీ వైద్యులు వారి ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారని ఉప్పల్‌కి చెందిన ఓ బాధితుడు తెలిపారు. రోగ నిరోదశ శక్తిని పెంచేందుకు గాంధీలో మంచి ఆహారాన్ని ఇచ్చారని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News