Friday, March 29, 2024

అత్యాచారం అబద్ధం

- Advertisement -
- Advertisement -

Gandhi Rape Incidents Are Fake Says CP Anjani Kumar

అంతా కల్లు మహిమ
గాంధీ ఆసుపత్రి గ్యాంగ్‌రేప్ ఆరోపణ చిక్కుముడి విప్పిన పోలీసులు
అత్యాచారం ఫిర్యాదు బూటకమే, అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ కల్లు అలవాటుంది
సెక్యూరిటీ గార్డుతో ఇష్టపూర్వకంగా సంబంధం పెట్టుకున్న చెల్లి
కల్లు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లి గ్యాంగ్‌రేప్ కట్టుకథ అల్లిక
ఆసుపత్రి నుంచి వెళ్లి రెండు రోజుల పాటు కాగితాలేరుకునే వ్యక్తితో ఉన్న అక్క

మన తెలంగాణ/సిటిబ్యూరో: క్రైం సీరియల్‌ను తలదన్నేలాగా నడిచిన గాంధీ ఆ స్పత్రి గ్యాంగ్ రేప్ ఆరోపణ కేసులో అసలు అత్యాచారమే జరగలేదని పోలీసులు తేల్చారు. ఇద్దరు కలిసి కట్టుకథ అల్లారని పోలీసులు స్పష్టం చేశా రు. మహబూబ్‌నగర్ జిల్లాకు చె ందిన వ్యక్తికి కిడ్నీ ఫెయిల్ కావడంతో చికిత్స కోసం గాంధీ ఆ స్పత్రికి వచ్చారు. ఈ నెల 4వ తే దీన తమకు తెలిసిన ల్యా బ్ టె క్నీషియన్ ఉమామహేశ్వర్ సా యంతో ఆస్పత్రిలో చేర్పించారు. కిడ్నీ రోగికి సా యంగా వచ్చిన భార్య, మరదలు 7వ తేదీ నుంచి అతడి వద్దకు వెళ్లలేదు. ఈ క్రమంలోనే తమపై అ త్యాచారం జరిగిందని చెల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. వెంటనే కేసు నమోదు చేసుకు న్న చిలకలగూడ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు. కన్పించకుండా పోయిన కిడ్నీ రోగి భార్యను వెతికేందుకు నగరం లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఆ మహిళ నారాయణగూడలో తిరుగుతుండగా పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.

అప్పుడు అసలు విషయం బయటికి వచ్చింది. సదరు మహిళ ఓ వ్యక్తితో ఇష్టపూర్వకంగానే బయటికి వెళ్లినట్లు తెలిసింది. రెండు రోజులు అత డి వద్ద ఆశ్రయం పొందినట్లు తెలిసింది. మహిళకు షెల్ట ర్ ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచా రిస్తున్నారు. అక్క ఆస్పత్రి నుంచి వెళ్లిపోవడంతో చెల్లెలు అక్కడే ఉంది. అక్కాచెల్లెలు ఇద్దరికి కల్లు తాగే అలవాటు ఉందని, కల్లు తాగడంతో చెల్లెలు అపస్మారక స్థితిలోకి వెళ్లిందని పోలీసుల విచారణలో తేలింది. అక్క విష యం దాచిపెట్టేందుకే గ్యాంగ్ రేప్ కథ అల్లిందని తెలిసిం ది. అంతేకాకుండా ఇద్దరు కల్లుకు బానిసలుగా మారడంతో మానసిక స్థితి కూడా సరిగాలేనట్లు తెలిసింది.

అత్యాచారం జరగలేదు : అంజనీకుమార్, నగర పోలీస్ కమిషనర్

గాంధీ ఆస్పత్రిలో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరగలేద ని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఇద్దరు మహిళలు ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లకు కెమికల్ కల్లు తాగే అలవాటు ఉందని చెప్పారు.
అక్క బయటికి వెళ్లడంతో చెల్లి ఆమెను వెతుక్కుం టూ వెళ్లి గాంధీ ఆస్పత్రి సెక్యూరిటీ గార్డుతో పరిచయం పెంచుకుందని చెప్పారు. అదే రోజు సెక్యూరిటీ గార్డు, ఆమె పరస్పర అంగీకారంతో ఏడవ ఫ్లోర్‌లో లైంగికంగా కలిశారని తెలిపారు. తర్వాత మరొకసారి సెల్లార్‌లో మళ్లీ లైంగికంగా కలిశారని తెలిపారు. ఈమె అక్క ఆస్పత్రి నుంచి వెళ్లి రెండు రోజుల పాటు కాగితాలు ఏరుకునే వ్యక్తితో ఉందని చెప్పారు. దాదాపు 800 గంటల సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించామని తెలిపారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న రేడియాలజీ డార్క్ రూమ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉమామహేశ్వర్ తప్పు లేదని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News