Home తాజా వార్తలు పూర్తి వినోదాత్మకంగా…

పూర్తి వినోదాత్మకంగా…

Gang Leader

 

నేచురల్ స్టార్ నాని, వర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను బుధవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.

అలాగే ’రారా.. జగతిని జయించుదాం…’ అంటూ సాగే ఈ సినిమా ఫస్ట్ సాంగ్‌కి కూడా మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ మైమరపించే విధంగా ఉంది. పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలోని ఒక ప్రధాన పాత్రను ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ పోషిస్తున్నారు.

ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్, మాటలు: వెంకీ, డార్లింగ్ స్వామి, రచనా సహకారం: ముకుంద్ పాండే, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్, ఆర్ట్ డైరెక్టర్: రామ్‌కుమార్, ఎడిటింగ్: నవీన్ నూలి.

Gang Leader Teaser Release on wednesday