Home తాజా వార్తలు కామ పిశాచులు

కామ పిశాచులు

Gang-rape of student in Nizamabad

మద్యం తాగించి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
నిజామాబాద్‌లో మంగళవారం అర్ధరాత్రి నలుగురు గుర్తుతెలియని వ్యక్తుల పైశాచిక చర్య, ఆర్‌టిసి బస్టాండ్ దగ్గరి ప్రైవేట్ ఆసుపత్రి గదికి తీసుకెళ్లి దుర్మార్గం, నిందితుల కోసం పోలీసుల వేట

మనతెలంగాణ/హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం అర్థరాత్రి నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఓ విద్యార్థినికి బలవంతంగా మద్యం తాగించి ఆర్‌టిసి బస్టాండ్ సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రిలోని గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈక్రమంలో అపస్మార స్థితిలో ఉన్న విద్యార్థిని అరుపులు విన్న ఆసుపత్రి సెక్యూరిటీ గదిలోకి వెళ్లి చూడటంతో ఆ యువతిపై అత్యాచారం జరిగిందని గుర్తించారు. వెంటనే ఆసుపత్రి సిబ్బంది 100కు ఫోన్‌చేసి పోలీసులకు సమాచారం అందించారు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా ఆసుపత్రిలో సిసి ఫుటేజీలు పరిశీలించారు.

అనంతరం బాధితురాలిని చికిత్స నిమిత్తం సఖీ సెంటర్‌కు తరలించారు. ఈ ఘటనపై అదనపు సిపి ఉషా విశ్వనాథ్ వివరాలు సేకరిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఓ కాలేజ్ వచ్చిన విద్యార్థినిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. విద్యార్థినిని వెంబడించి, బలవంతంగా మద్యం తాగించి దారుణానికి తెగబడ్డారని పోలీసులు భావిస్తున్నారు. విద్యార్థిని బస్టాండులో ఉండగా దుండగులు ఆమెకు మద్యం తాగించి సమీపంలోని ఓ ఆసుపత్రి గదిలో అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈక్రమంలో బాధితురాలని మహిళా కమిషన్ సభ్యురాలు సుదాం లక్ష్మీ పరామర్శించారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు భద్రత లేకపోవడంపై ఆందోళనకు గురవుతున్నారు.