Home మంచిర్యాల దళిత బాలికపై సామూహిక అత్యాచారం

దళిత బాలికపై సామూహిక అత్యాచారం

ఆరుగురిపై నిర్భయ కేసు నమోదు

GANG-RAPE

దండేపల్లి: మంచిర్యాలజిల్లా దండేపల్లి మండలం లక్ష్మికాంతపూర్ గ్రామానికి చెందిన దళిత మైనర్ బాలిక (17)పై అదే గ్రామానికి ఆరుగురు యువకులు సాముహిక అత్యాచారానికి పాల్పడినందుకు వారిపై బుధవా రం ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ, నిర్భయ కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సంజీవ్ తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. లక్ష్మీకాంతపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే యువకుడు బాలికకు ఫోన్‌లో మేసేజ్ పంపారు చూసి, గత నెల 12న బాలిక గ్రామశివారులోని పత్తి చేనులలోకి వచ్చింది.

లక్ష్మణ్‌తో పాటు మరో ఐదుగురు యువకులు బాలికపై సాముహిక అత్యాచారా నికి పాల్పడినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ విషయం ఇంటిలో తల్లిదండ్రులకు చెపితే చంపివేస్తామని బాలికను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. బాలిక కొద్ది రోజుల నుంచి మానసికంగా కుంగిపోయి ఉండడంతో తల్లి దండ్రులు ఆరా తీశారు జరిగిన విషయాన్ని తల్లి దండ్రులకు తెలిపి వారి సాయంతో . ఫిర్యాదు చేయగా ఆరుగురిపై నిర్భయ, అట్రాసిటీ కేసు లు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.