Home వార్తలు వివాహితపై ముగ్గురు అత్యాచారం

వివాహితపై ముగ్గురు అత్యాచారం

RAPEమన తెలంగాణ/కాప్రా: ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ వివాహితపై అత్యాచారం జరిపిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కుషాయిగూడ హనుమాన్‌నగర్‌కాలనీకి చెందిన వివాహిత (24)ను జూన్ 20వ తేదీ రాత్రి 9గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై బండ్లగూడ ఐకాం కంపెనీ వద్ద గల నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడే వేచి ఉన్న మరో వ్యక్తితో కలసి ముగ్గురు అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ తర్వాత తిరిగి ఆమెను ఇంటి దగ్గర దించి వెళ్లారు. షాక్‌కు గురైన ఆమె జరిగిన విషయాన్ని తన భర్తకు చెప్పడంతో తేరుకున్న వారు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉండే అలీ, సుధాకర్ కలిసి తనను బైక్‌పై తీసుకెళ్లారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వీరిద్దరిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై నిర్భయ కేసు, అత్యాచారం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కుషాయిగూడ పోలీసులు తెలిపారు.