Home తాజా వార్తలు ఉద్యోగం ఇప్పిస్తానని మైనర్ పై సామూహిక అత్యాచారం

ఉద్యోగం ఇప్పిస్తానని మైనర్ పై సామూహిక అత్యాచారం

girl

 

న్యూఢిల్లీ: 16 ఏళ్ల బాలికకు పెద్ద ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన ఢిల్లీలోని మోతీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ చెందిన ఓ అమ్మాయి తన బంధువుల దగ్గర ఉంటూ సూపర్ మార్కెట్‌లో పని చేస్తోంది. పరిచయం ఉన్న అంకిత్, రవి అనే యువకులు ఆమెకు పెద్ద ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఇఎస్‌ఐ క్వార్టర్స్‌లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. అమ్మాయి వాళ్ల నుంచి తప్పించుకొని పోలీసులకు ఫోన్ చేసింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆరోగ్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇఎస్‌ఐలో ఉన్న సిసి కెమెరాల అధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. ఫోన్ సిగ్నల్ అధారంగా నిందితులను బసాయి దరాపూర్ గ్రామంలో పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. సదరు బాలికను బంధువులకు అప్పగించారు.

 

Gang Rape on Minor with Offered Better Job