Home తాజా వార్తలు జూబ్లీహిల్స్‌లో నడిరోడ్డుపై దొంగల వేట

జూబ్లీహిల్స్‌లో నడిరోడ్డుపై దొంగల వేట

ఇద్దరి పట్టివేత, దుండగుల కాల్పుల్లో గాయపడిన మెట్రో ఉద్యోగి

Police_manatelangana copyమన తెలంగాణ/హైదరాబాద్/సిటీబ్యూరో: భారీ దోపిడీ చేసేందుకు అంత ర్రాష్ట్ర దోపిడీ ముఠా పన్నిన కుట్రను హైదరాబాద్ నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. ముఠాకు చెందిన ఓ సభ్యుడిని రెండు రోజుల క్రితమే అదుపు లోకి తీసుకున్న పోలీసులు అతడి ద్వారానే డెకాయి ఆపరేషన్ నిర్వహించారు. గురువారం జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లోని నీరూస్ షో రూం చౌరస్తా వద్ద దుండగులను పోలీసులు పట్టుకునేందుకు యత్నించగా వారు కాల్పులకు తెగ బడ్డారు. ఈ కాల్పుల్లో మెట్రోరైలు నిర్మాణంలో పనిచేస్తున్న ఎల్‌అండ్‌టీ కార్మి కుడి ఛాతి పైభాగంలోకి బుల్లెట్ దూసుకుపోయింది. పారిపోతున్న దుండగుల ను పోలీసులు, స్థానికులు వెంబడించడంతో ఇద్దరు పట్టుబడ్డారు. పూర్తి వివ రాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా రాయచూర్‌కు చెందిన కరుడుగట్టిన దోపిడీ ముఠా సభ్యులు మీర్జా అబ్దుల్ ఉల్లా బేగ్, అబ్దుల్ ఖాదర్‌లు గతంలో దోపిడీ కేసులో జైలుకెళ్లి కొద్ది నెలల క్రితమే విడుదలయ్యారు. మళ్లీ దోపిడీలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సారి హైదరాబాద్‌పై వారి కన్ను పడింది. నగరంలో భారీ దోపిడీ చేసి రాయ్‌చూర్‌కు పారిపోవాలని కుట్ర పన్నారు. ఈ కుట్రను అమలు చేసేందు టోలిచౌకీకి చెందిన షమీమ్ వారితో చేతులు కలిపాడు. దోపిడీకి అవసరమైన వసతులు, వాహనాలు, కావాల్సిన డబ్బులు, షెల్టర్ ఇవ్వడానికి షమీమ్ అంగీకరించాడు.
‘బిగ్ సి’ డబ్బులే టార్గెట్…..
టోలిచౌకికి చెందిన షమీమ్ మాదాపూర్‌లోని బిగ్ సి మ్బైల్ షోరూంలో ఉద్యో గి. బిగ్ సి వ్యాపార లావాదేవీల డబ్బును యజమాని ప్రతి రోజు జూబ్లీహిల్స్ బ్యాంకులో డిపాజిట్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న షమీమ్.. మీర్జా, అబ్దుల్‌ఖాదర్‌లకు చెప్పాడు. ముందుగా బిగ్ సీలో దోపిడీ చేయాలని, కారులో వెళ్తుండగా బిగ్ సి యజమానిని తుపాకీతో బెదిరించి దోచుకోవాలని ఆ ముగ్గు రు కలిసి స్కెచ్ వేశారు. దోపిడీపై వారం రోజుల నుంచి ఈ ముగ్గురు రెక్కీ నిర్వ హించసాగారు. అనుమానం వచ్చిన బిగ్ సీ యజమాని సమాచారం అందించ డంతో రెండు రోజుల క్రితం ఉద్యోగి షమీమ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
డెకాయి ఆపరేషన్ సక్సెస్…
బిగ్ సీ యజమాని నుంచి డబ్బులు దోచుకునేందుకు పన్నిన కుట్రను పోలీసులకు షమీమ్ పూసగుచ్చినట్లు విచారణలో వెల్లడించాడు. ఇంకేముందు షమీమ్‌ను ఉపయోగించి అంతరాష్ట్ర దోపిడీ మూఠా సభ్యులు మీర్జా, అబ్దుల్ ఖాదర్‌లను పట్టుకునేందుకు పోలీసులు పక్కా స్కెచ్ రూపొందించి డెకాయి ఆపరేషన్‌కు సిద్దమయ్యారు. గురువారం ఉదయం షమీమ్‌తో మీర్జా, అబ్దుల్ ఖాదర్‌లకు పోలీసులు ఫోన్ చేయించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమ యంలో నీరూస్ సమీపంలో బిగ్ సీ యజమానిని అడ్డగించి దోపిడీకి పాల్ప డాలని షమీమ్ వారికి చెప్పాడు. ఇక దోపిడీ చేసి వచ్చిన డబ్బుతో ఉడాయిం చాలని అనుకున్న మీర్జా, అబ్దుల్ ఖాదర్‌లు బైక్‌పై బిగ్ సీ యజమాని ఇంటి నుంచి అతని కారును వెంబడిస్తూ వస్తున్నారు. షమీమ్ డెకాయి ఆపరేషన్‌లో భాగంగా నీరూస్ చౌరస్తా వద్ద ఉన్నాడు. మీర్జా, అబ్దుల్ ఖాదర్‌ల బైక్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు వెంబడిస్తూ వస్తున్నారు. సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకు బైక్ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లోని నీరూస్ చౌరస్తా సిగ్నల్ దాటింది. అక్కడే ఉన్న షమీమ్‌ను చూసి బైక్‌ను ఆపారు. బైక్ ఆపిన వెంటనే అక్కడే మాటు వేసిన ఓ పోలీసు బైక్‌ను నడిపిస్తున్న అబ్దుల్ ఖాదర్ మెడపై కొట్టాడు. తలకు హెల్మె ట్‌తో ఉన్న అబ్దుల్ ఖాదర్ కింద పడిపోయాడు. వెనకాల కూర్చున్న మీర్జా పారి పోయేందుకు యత్నించాడు. వాహనంలో వెంటాడుతున్న టాస్క్‌ఫోర్స్ పోలీ సులు మీర్జాను పట్టుకున్నారు. ఇద్దరి మధ్య పెనుగులాట జరగడంతో పారిపో యేందుకు మీర్జా తన వద్ద ఉన్న తపంచాతో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు.
ధర్మేందర్‌రామ్ ఛాతిలోకి దూసుకుపోయిన బుల్లెట్…
అదే సమయంలో మెట్రో పనులు ముగించుకున్న సుమారు 16 మంది ఎల్‌అండ్‌టీ కార్మికులు భోజనం చేసేం దుకు డిసిఎం వ్యాన్‌లో జూబ్లీ హిల్స్ చెక్‌పోస్టు నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లోకి వెళ్లేందుకు నీరూస్ చౌరస్తా వద్ద రైట్ టర్న్ తీసుకుంటుం డగా ఒక తూటా వచ్చి వ్యాన్‌లో ఉన్న ధర్మేందర్ రామ్ (25) ఎడమ ఛాతి పైభాగంలోకి దూసుకుపోయింది. కాల్పులు జరిపి పారిపోతున్న దుండ గులను పోలీసులు, స్థానికులు వెంబడించి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రెండు తపంచాలతో పాటు 20 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ ధర్మేందర్‌రామ్‌ను మాదాపూర్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో డాక్టర్లు వైద్య సేవలు అందించడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది.
దోపిడీ చేసేందుకు వచ్చారు : కమిషనర్ మహేందర్‌రెడ్డి
మాదాపూర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధర్మేందర్‌రామ్‌ను నగర అదనపు పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌తో కలిసి కమిషనర్ ఎం. మహేందర్‌రెడ్డి సందర్శించి పరామర్శించారు. అక్కడి నుంచి కమిషనర్ కాల్పు లు జరిగిన నీరూస్ చౌరస్తా వద్దకు చేరకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. నగరంలో భారీ దోపిడీ చేసేందుకే ఈ ముఠా నగరంలోకి ప్రవేశించిదన్నారు.