Home తాజా వార్తలు సల్మాన్ ను చంపాలనుకున్న గ్యాంగ్ స్టర్ ఇతడే

సల్మాన్ ను చంపాలనుకున్న గ్యాంగ్ స్టర్ ఇతడే

Salman-Khan

హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ హత్యకు కుట్ర జరిగిన విషయం శనివారం బయటపడింది.  కృష్ణజింకను వేటాడి చంపిన కేసులో సల్మాన్ పలుమార్లు జైపూర్ కోర్టుకు వెళ్లాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్  కృష్ణ జింకను చంపినందుకు సల్మాన్ ను అంతం చేస్తామని హెచ్చరించింది. ఈ గ్యాంగ్ లో ముఠా సభ్యుడు సంపత్ నెహ్రా అనే వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు జూన్ 6న అరెస్ట్ చేశారు. హర్యానాలో గ్యాంగ్ స్టార్ సంపత్ పై మర్డర్ కేసులు ఉన్నాయి. దీంతో శనివారం సంపత్ ను హర్యానా పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.  తాను సల్మాన్ ఖాన్ అభిమానంటూ పలుమార్లు అతడి ఇంటి దగ్గర సంపత్ రెక్కీ నిర్వహించనట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. రేస్-3 సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు సల్మాన్ ను చంపేందుకు  ఓ గ్యాంగ్ కు చెందిన వ్యక్తులు ఫిల్మ్ సిటీలోకి ప్రవేశించారని పోలీసులు చెప్పడంతో సల్మాన్ ను సురక్షితంగా బాంద్రాలోని అతడి నివాసానికి తీసుకెళ్లారు. కృష్ణ జింకను చంపిన కేసులో సల్మాన్ ను జైపూర్ కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే.