Home తాజా వార్తలు ’గంగూభాయ్ క‌తియావాడి‘ తెలుగు టీజ‌ర్ విడుదల

’గంగూభాయ్ క‌తియావాడి‘ తెలుగు టీజ‌ర్ విడుదల

Gangubai Kathiawadi TeluguTeaser Releaseహైదరాబాద్ : ప్రముఖ బాలీవుడ్ నటి అలియాభట్ నటిస్తున్న బాలీవుడ్ సినిమా ‘గంగూభాయ్ కతియావాడి’. ఈ సినిమాను అదే టైటిల్ తో తెలుగులో విడుదల చేయనున్నారు. ముంబయిలోని కామాతిపురాలో సెక్స్ వ‌ర్క‌ర్‌ అయిన గంగూభాయ్ క‌తియావాడి జీవిత‌క‌థ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. టైటిల్ పాత్రలో అలియాభట్ నటిస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అలియాభట్ వేశ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ కు సంబంధించిన టీజర్ ను శుక్రవారం విడుదల చేశారు. ఈ టీజర్ ఆకట్టుకునేవిధంగా ఉంది. ఈ సినిమా జూలై 30 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇదిలా ఉండగా అలియాభట్ దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జోడీగా సీత పాత్రలో నటిస్తున్నారు.