Thursday, April 25, 2024

అభ్యర్థి ఎంపికలో సిఎం కెసిఆర్ నిర్ణయమే ఫైనల్..

- Advertisement -
- Advertisement -

Gangula Kamalakar meeting over MLC Candidate

కరీంనగర్: డిసెంబర్ 10న నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ సిద్దమౌతుంది. అందులో బాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని శనివారం మంత్రి గంగుల కమలాకర్ నిర్వహించారు. కరీంనగర్ నగర పాలక, కొత్తపల్లి పురపాలక సంఘాలకు చెందిన డిప్యూటీ మేయర్, ఛైర్మన్, కార్పోరేటర్లు, కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికను పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ, ముఖ్యమంత్రి కెసిఆర్, టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించే అభ్యర్థికి పార్టీలో ఓటు హక్కు ఉన్న ప్రతీ ఒక్కరూ ఏక నిర్ణయంతో మద్దతు తెలపాల్సిందిగా సూచించారు.

సమావేశంలో పాల్గొన్న పాలకవర్గాల సభ్యులు ఈ ప్రతిపాధనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అభ్యర్థి నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ పార్టీ నిర్ణయమే శిరోదార్యమని, పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి సంపూర్ణ మద్దతు తెలుపుతామని మంత్రి ద్వారా అదిష్టానానికి తెలియజేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల నియోజకవర్గాలకు ఎన్నికల ఇంచార్జిగా మంత్రి గంగుల, పెద్దపల్లి, జగిత్యాల నియోజకవర్గాలకు ఎన్నికల ఇంచార్జిగా మంత్రి కొప్పుల ఈశ్వరు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ ఛైర్మన్ రుద్రరాజు, ఇరు పాలకవర్గాల సభ్యులు పాల్గొన్నారు.

Gangula Kamalakar meeting over MLC Candidate

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News