Friday, April 26, 2024

రైతు ధర్నా ఏర్పాట్లపై మంత్రి గంగుల సమీక్ష..

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విదానాలు, తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలుపై బీజేపీ నేతల అడ్డగోలు వాదనలకు నిరసనగా శుక్రవారం తలపెట్టిన ధర్నా ఏర్పాట్లపై బుధవారం జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో మంత్రి గంగుల కమలాకర్ సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టే ఆందోళనల్లో పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొనాలని, వారిని సమన్వయపరుచుకొనే బాధ్యతలు నాయకులు చేపట్టాలని సూచించారు. రాజ్యాంగం ప్రకారం ప్రతీ గింజను కొనే బాధ్యత గల కేంద్రం దాన్నుండి తప్పించుకుంటున్న తీరును రైతులకు సమగ్రంగా వివరించాలన్నారు. వ్యవసాయ మార్కెట్లను ప్రైవేటుకు దోచిపెట్టే కుట్రల్ని చేస్తూ దొంగే దొంగ అన్నట్టుగా బిజెపి అనుసరిస్తున్న వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలన్నారు. తెలంగాణ రైతాంగానికి సహాయం చేయకపోగా, రాష్ట్ర ప్రభుత్వ రైతు అనుకూల విధానాలు, రైతుబందు, 24గంటల ఉచిత కరెంటు, కాళేశ్వర జలాలతో ఇప్పుడిప్పుడే తెరిపిన పడుతున్న రైతును గందరగోళంలో పడేసేలా బీజేపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే విదంగా శుక్రవారం దర్నాలు నిర్వహించాలని మంత్రి గంగుల సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రసమయి భాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసులక్ష్మణ్ రావు, టీఆర్ఎస్ సీనియర్ నేత పెద్దిరెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

Gangula Kamalakar review on Strikes against Centre

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News