Tuesday, April 23, 2024

రూ.2కోట్లతో హుజురాబాద్ లో పెద్దమ్మ గుడి..

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: ముధిరాజులపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు అపారమైన ప్రేముందని, అడిగిందే తడవుగా రెండు కోట్ల రూపాయలతో హుజురాబాద్ లో పెద్దమ్మ తల్లి గుడితో పాటు బ్రిడ్జి, రోడ్డు పనుల కోసం కేటాయించారని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం మంత్రి హరీష్ రావుతో కలిసి హుజూరాబాద్ పట్టణంలోనీ రంగనాయకుల గుట్ట వద్ద పాటిమిది ఆంజనేయ స్వామి జ్ఞాన సరస్వతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్దమ్మ గుడి నిర్మాణానికి మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, టిఆరెఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమాలకర్ మాట్లాడుతూ.. ”గతంలో నిర్లక్ష్యానికి గురైన ముధిరాజు సామాజిక వర్గానికి అండగా ఉండి అభివ్రుద్ది చేయడంతో పాటు వారి కులదైవం పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణానికి అడిగిందే తడవుగా ప్రభుత్వం సంకల్పించిందన్నారు. భక్తుల సౌకర్యం కోసం పెద్దమ్మ తల్లి గుడికి వెళ్లడానికి కోటి రూపాయలతో చిలుకవాగు బ్రిడ్జి, రూ.60లక్షలతో రోడ్డు, రూ.40 లక్షలతో గుడి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయడంతో పాటు పనులను ప్రారంభించాం. బిసిల కోసం, ముధిరాజుల కోసం నిధుల్ని కేటాయించి అండగా ఉన్న సిఎం కెసిఆర్ కు మద్దతుగా ఉండాలి. నికార్సైన బిసి బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించుకోవాలి. గెల్లు గెలిచిన తర్వాత.. హుజురాబాద్ లో ఎలాంటి పనికోసమైన గెల్లుతో పాటు నేను, మంత్రి హరీష్ రావు నిరంతరం కృషి చేస్తాం” అని చెప్పారు.

Gangula Kamalaker Bhoomi Puja for Peddamma Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News