Friday, April 19, 2024

గంగూలీలాగానే కోహ్ల్లి కూడా..

- Advertisement -
- Advertisement -

నాయకత్వం విషయంలో ఇద్దరికీ చాలా పోలికలున్నాయి
ఆస్ట్రేలియా మాజీ కోచ్ జాన్ బుచానన్

న్యూఢిల్లీ : టీమిండియా మాజీ సారథి సౌరబ్ గంగూలి లాగానే ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్ల్లి కూడా భారతఆస్ట్రేలియా జట్ల మధ్య క్రికెట్ పోరును మరోస్థాయికి తీసుకెళ్లాడని ఆస్ట్రేలియా మాజీ కోచ్ జాన్ బుచానన్ పేర్కొన్నాడు. తాజా గా ఆయన స్పోర్ట్ స్టార్’తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. గంగూలిలోని పలు నాయకత్వ లక్షణాలు కోహ్లీలోను ఉన్నాయన్నాడు. ‘గం గూలి టీమిండియా నాయకత్వ బాధ్యతలు చేపట్టాక ఆటతీరులో మార్పులు తెచ్చాడు. కేవలం క్రికెట్ ఆడడమే కాకుండా ఆస్ట్రేలియా లాంటి గొప్ప జట్ల్లను ఓడించడం ఎలాగో నేర్పించాడు. ఇరు జట్ల మధ్య ఆధిపత్యానికి అది ఆరంభం మా త్రమే. దాన్ని మరోస్థాయికి తీసుకెళ్లే సామర్థం గంగూలికి ఉంది. ఇప్పుడు కోహ్లీ కూడా అలానే ఉన్నాడు.

టీమిండియాను మరోస్థాయికి తీసుకెళ్లాడు’ అని బుచానన్ అన్నాడు. ‘ ఇప్పటివరకు కోహ్లీ పరుగులు చేసినా, చేయకపోయినా జట్టు ను నడిపించడంలో బాగానే పనిచేశాడు. 201819 సిరీస్‌లో పుజారా మేటి ప్రదర్శన చూ పాడు. కోహ్లీ, రహానే సైతం అప్పుడు తమవంతు పాత్రను పోషించారు. అయితే కోహ్లీ జట్టును నడిపించిన తీరు, నాయకత్వ లక్షణమే అసలైన గొప్పతనం. అతను టీమిండియాను గెలిపించడమే కాకుండా ఇతర జట్లను ఓడించే మార్గాలను కనుగొన్నాడు’ అని అన్నాడు. ఇక ఆసీస్ సిరీస్ తొలి టెస్టు తర్వాత టీమిండియా కెప్టెన్ తిరిగి వచ్చేయడంపై బుచానన్ స్పందిస్తూ, అది టెస్టు సిరీస్‌లో కీలకం కానుందని వ్యాఖ్యానించాడు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ వచ్చే జనవరిలో మొదటి సారి బిడ్డకు జన్మనివ్వనుండడంతో కోహ్లీ స్వదేశానికి తిరిగి వస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News