Home తాజా వార్తలు వెయ్యి కిలోల గంజాయి పట్టివేత…

వెయ్యి కిలోల గంజాయి పట్టివేత…

ganjaహైదరాబాద్: నగరంలోని ఎల్‌బినగర్ పరిధిలో డిఆర్‌ఐ అధికారులు, బాలానగర్‌లో అబ్కారీ శాఖ సిబ్బంది శనివారం నిర్వహించిన తనిఖీలలో దాదాపు 1000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌బి నగర్‌లో కార్గో లారీలో కొబ్బరికాయల లోడ్‌లో రహస్యంగా తరలిస్తున్న 945 కేజీల గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారం అందుకున్న డిఆర్‌ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు తనిఖీలు చేపట్టి లారీ డ్రైవర్‌తో పాటు మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

భద్రాచలం నుంచి సంగారెడ్డి పైపు తరలిస్తున్న లారీలో డిఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.1.88 కోట్లు ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు. అలాగే మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ పరిధిలోని బాలానగర్‌లో ఎస్‌ఒటి పోలీసులు మూడు కార్లలో తనిఖీలు చేపట్టి రూ. 20 లక్షలు విలువ చేసే గుట్కా స్వాధీనం చేసుకున్నారు. అలాగే బాలానగర్‌లో అబ్కారీ శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీలలో 1500 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని చాక్లెట్ల రూపంలో తయారు చేసిన తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు.

Ganja worth Rs 1.8Cr seized in Hyderabad